ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ | Asian Champions Trophy Semi Final: India Thrash South Korea, Set Up Final Against Japan | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్

Nov 4 2026 9:03 PM | Updated on Nov 4 2026 9:03 PM

Asian Champions Trophy Semi Final: India Thrash South Korea, Set Up Final Against Japan

source: X

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026లో భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం మొహాలీ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 8-1తో చిత్తు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది.

షిలానంద్ లక్రా, దిల్ప్రీత్ సింగ్ రెండేసి గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మిగతా ఆటగాళ్లు కూడా సమన్వయంతో ఆడటంతో దక్షిణ కొరియాకు ఏ దశలోనూ కోలుకునే అవకాశం దక్కలేదు.

మరోవైపు భారత రక్షణ విభాగం కూడా ప్రత్యర్థి దాడులను సమర్థంగా అడ్డుకుంది. దీంతో దక్షిణ కొరియా ఒక్క గోల్‌కే పరిమితమైంది. చివరకు భారత్ 8-1తో భారీ విజయాన్ని అందుకుంది.

ఫైనల్లో జపాన్‌తో అమీతుమీ
రేపు ఇదే వేదికపై జరిగే ఫైనల్లో భారత్‌ జపాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఐదు సార్లు టైటిల్ గెలిచిన భారత్.. ఆరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

ఇదీ చదవండి: ఐదేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు సింధు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement