musical
-
స్మిత సరికొత్త సంగీత ప్రయాణం!
నిత్యం ఏదో ఒక కొత్త ప్రయోగంతో జనంలోకి వచ్చి... సరికొత్తగా వార్తల్లో నిలిచే ప్రముఖ గాయని స్మిత. తాజాగా ఆమె మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. కాకపోతే, ఇప్పటి వరకు ర్యాప్, పాప్ లాంటి పాటలతో అలరించిన ఆమె ఈసారి అందుకు పూర్తి భిన్నమైన దోవ తొక్కుతున్నారు. మానవ జీవిత పరమార్థాన్ని వివరిస్తూ, మనసును మేలుకొలిపి, చిత్తాన్ని చైతన్యం చేసే తత్వాలను ఆలపిస్తూ, జనం ముందుకు రానున్నారు. తరతరాలుగా మనకు సంస్కృతీ వారసత్వంగా వస్తున్న తెలుగు, సంస్కృత సాహిత్యాల్లోని సుప్రసిద్ధమైన తాత్త్విక కృతులను ఎంచుకొని, వాటిని తనవైన కొత్త బాణీలలో, క్రొంగొత్త ఆర్కెస్ట్రయిజేషన్తో ‘తత్త్వమసి... (ఉపశీర్షిక - నాద టు నిర్వాణ)’ పేరిట నవ తరానికి అందించనున్నారు.మన చిన్నప్పుడు ఒక దశలో పెద్దవాళ్ళు పిల్లలందరికీ సుమతీ శతకం, వేమన శతకం చెప్పేవారు. మన సినిమాల్లో, రేడియోలో రకరకాల తత్త్వాలు వినిపించేవి. సినీ దర్శకుడు దేవా కట్టా అన్నట్టు, “దురదృష్టవశాత్తూ, మనం, మన సినిమాలు ఆ ఘన సంస్కృతీ వారసత్వాన్ని వదిలేసుకున్నాం. కనీసం బయటైనా అలాంటివి వినడానికీ, స్మిత చేస్తున్న ఓ మంచి ప్రయత్నమే ఇది”. మన భాష, సాహిత్యం, సంస్కృతుల ఖజానా నుంచి ఓ వంద ఆణిముత్యాలను ఏర్చికూర్చి, ఒక్కొక్కటిగా ‘తత్త్వమసి’లో స్మిత అందించనున్నారు. అలా “తరువాతి తరాలకు మన తాత్త్విక చింతనా వారసత్వాన్ని అందించనున్నారు”.శివరాత్రితో స్మిత అనుబంధం... ప్రకృతి ఆదేశం...‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ అంటూ పాప్ పాటలతో గాయని స్మిత వివిధ ప్రాంతాలకు పర్యటించాలని ప్రయత్నాలు సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఎదురైన ఈ ట్విస్టు ఏమిటని ఎవరికైనా అనిపిస్తుంది. అదే అడిగితే, స్మిత సైతం ఇదంతా చిత్రంగా జరిగిందని ఒప్పుకుంటున్నారు. “మ్యూజిక్ వీడియోలు చాలా ఏళ్ళ క్రితమే చేసేశాను. పేరు తెచ్చిన ఆ పాప్ పాటలను జనం ఎదుట వేదిక మీద పాడుతూ, ప్రదర్శన ఇవ్వాలంటే చాలా సన్నద్ధత కావాలి. అందుకే, ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ టూర్‌కి డేట్లు అడిగినప్పుడు... ‘దాన్ని పక్కాగా డిజైన్ చేసి, శారీరకంగా, మానసికంగా సన్నద్ధమయ్యేందుకు కొద్దిగా సమయం కావాల’ని అడిగాను. ఇంతలో ఈ తత్త్వాలను పాడాలనే ఆలోచన వచ్చింది” అని ఆమె వివరించారు.రెండు, మూడు నెలల క్రితం శివరాత్రి సందర్భంగా స్మిత వల్లూరుపల్లి, మరో సినీ నేపథ్య గాయని తిరుమల శ్రీనిధి కలసి ‘ఏమి సేతురా లింగా...’ అనే ప్రసిద్ధమైన శివతత్త్వాన్ని కొత్త రీతిలో ఆలపించారు. ఆ గీత రూపకల్పన ఒక రకంగా ఈ భారీ తత్త్వాల ప్రాజెక్ట్‌కు అనుకోని రీతిలో నాంది అయింది. “నిజం చెప్పాలంటే, మహాశివరాత్రికీ, నా జీవితానికీ ఏదో తెలియని బంధం ఉంది. కీలకమైనవెన్నో జరుగుతుంటాయి. ప్రతి ఏటా శివరాత్రి వచ్చిందంటే, ఏదో అతీత శక్తి అంతకు ముందు వరకు అసలు ప్లాన్ చేయనిది ఏదో నేను చేసేలా ముందుకు నెడుతుంది. అలా చేసిన ప్రతిదీ ఓ అద్భుతంగా ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఆత్మ చైతన్యం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా అలాంటిదే జరిగింది. ‘ఏమి సేతురా లింగా...’ తత్త్వం పాడగానే, మరిన్ని పాడాలంటూ ప్రకృతి రకరకాల మనుషులు, మార్గాల ద్వారా చెప్పినట్టయింది. అంతే... అలా ఈ 2026లో ఈ ఆధ్యాత్మిక గాన ప్రయాణంలో అడుగులు వేస్తున్నాను” అని స్మిత వివరించారు.ఇంతకీ, ప్రకృతి ఆదేశం ఎవరెవరి నుంచి, ఎలా వచ్చిందంటారా? “శివరాత్రికి చేసిన ‘ఏమి సేతురా లింగా...’ తత్త్వం ఫైనల్ అవుట్ పుట్ మా అమ్మ (జోగులాంబ), మిత్రుడు దేవా కట్టా వింటున్నారు. ఆ సమయంలో... ‘నువ్వు ఒకటి కాదు... ఇలాంటి తత్త్వాలు 100 రికార్డు చేయాలి’ అని దేవా కట్టా అన్నారు. అలాగే, ఆ తర్వాత... సిద్ధవైద్యం ‘చక్రసిద్ధ’తో అనారోగ్యాలను దూరం చేసే సింధుజ అమ్మ సైతం ‘ఈ తత్త్వాలు నువ్వు పాడాలి’ అని నాతో అన్నారు. అలా ఆ మాటలన్నీ నాకు ప్రకృతి ఆదేశంగా అనిపించాయి. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. నా దృష్టిలో ఇది చేస్తున్నది నేను కాదు. ఈ పని చేయడానికి ప్రకృతి నన్ను ఓ సాధనంగా ఎంచుకుంది. అంతే!” అని స్మిత జరిగిన కథ చెప్పుకొచ్చారు. అలా పాప్ పాటల ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ పర్యటన కాస్తా అనూహ్యంగా ఇప్పుడు ‘తత్త్వమసి’ అయింది.అటు ఆధునిక పాప్... ఇటు ఆధ్యాత్మిక చింతన...ఆధునిక పాప్ గీతాలు, ఆధ్యాత్మిక తాత్త్విక చింతన... ఈ రెండు భిన్న ధ్రువాలను స్మిత ఎలా సంబాళించుకుంటారు? “నిజమే. ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’కీ, ‘తత్త్వమసి’కీ సంబంధమే లేదు. అది ఆలోచన నుంచి వస్త్రధారణ దాకా అంతా మెరుపులు, తళుకులతో సాగితే, ఇందులో ప్రశాంతత, ఆధ్యాత్మికత, చేనేత వస్త్రాలు చోటుచేసుకుంటాయి. తత్త్వాలు పాడినంత మాత్రాన నాలోని ఆ పాప్ పార్శ్వం చచ్చిపోలేదు, చచ్చిపోదు. గాయనిగా ఈ రెండు భిన్న కోణాలనూ చూపడం నాకిష్టం. ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య నా సింగింగ్ జర్నీ సాగుతూనే ఉంటుంది” అని స్థిరచిత్తంతో చెప్పారు స్మిత.బలమైన సంకల్పం... భగవదేచ్ఛ...‘తత్త్వమసి’ లాంటి ప్రాజెక్టులు చేయడం అంత సులభమేమీ కాదు. కచ్చితంగా “ఉద్వేగం నిండిన ఓ పిచ్చి ప్రేమ లాంటిది ఏదో ఉండాలి. నాలో అది ఉంది. నన్ను ఎవరన్నా సవాలు చేశారంటే చాలు... దాన్ని నేను ఆషామాషీగా తీసుకోను. బలంగా బదులిస్తా. చిన్నప్పటి నుంచి నన్ను చూసినవారికి నాలోని ఆ లక్షణం, ఆ వ్యక్తిత్వం బాగా తెలుసు. అలాంటి ఛాలెంజ్ ఎదురైనప్పుడల్లా నాలోని ఏదో శక్తి బయటకు వచ్చి, ఆ సవాలును స్వీకరించి, దృఢంగా జవాబిస్తుంది. ప్రతిసారీ అదే జరుగుతుంటుంది. ఈసారీ అదే జరిగింది. అందుకే, ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా, ఏ ప్రస్తావన తెచ్చినా ఆవు కథలాగా నా మాట, పాట, ప్రస్తావన తత్త్వంలోకే వెళుతోంది. దీన్నిబట్టి ఇది ఎంతటి బలమైన సంకల్పమో, ఎంతగా భగవదేచ్ఛో అర్థం చేసుకోవచ్చు” అని స్మిత చెప్పుకొచ్చారు.స్మిత తల్లి జోగులాంబ సైతం, “మా అమ్మాయి ఎప్పుడూ ఏదో ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్ చేపడుతుంది. ఎందుకింత కష్టం అనుకొనే లోగా, దానిలో పూర్తిగా లీనమై పని చేసేస్తుంది. నిజం చెప్పాలంటే, ఇది ఆమె చేస్తున్నది కాదు... ఏదో ఒక దైవిక శక్తి జోక్యంతో సాగుతున్న ప్రయాణం” అని అభిప్రాయపడ్డారు. “దేవుడు ఏదో ఒక నిర్ణీతమైన ప్రణాళికతోనే ప్రతి జీవినీ పంపిస్తాడు. బహుశా స్మితను ఈ వైవిధ్యభరిత ప్రయాణం కోసమే పంపి ఉంటాడు” అని దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించారు.ప్రతి శనివారం ఓ తత్త్వం! వంద వారాల బృహత్ ప్రయత్నం!ఇప్పటికే 8 తత్త్వాల గానం, చిత్రీకరణ చేసిన స్మిత మే 16వ తేదీ శనివారం నుంచి వారానికో గీతంతో 100 వారాల పాటు ప్రజల్ని పలకరించనున్నారు. ఆదిశంకరుల ‘భజగోవిందం’ నుంచి అన్నమయ్య సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే...’ దాకా అనేకం ఆ వరుసలో రానున్నాయి. ‘తెలిసితే మోక్షము తెలియకున్న బంధము...’, ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు...’ (అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు), ‘ఎక్కడ మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది…’ (తాళ్ళపాక పెద తిరుమలాచార్య రచన), ‘మానస సంచరరే...’ (సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన)... ఇలా అనేకం ఆ వరుసలో రానున్నాయి.అలాగే, అనుభూతి ప్రధానమైన ఈ తత్త్వాలను ప్రేక్షకుల ముందు స్మిత బృందం గానం చేస్తూ, దేశదేశాల్లో అనుభూతి ప్రధానమైన ప్రదర్శనలు ఇవ్వాలని ప్రణాళికా రచన చేస్తున్నారు. ‘ఇండియన్ రాగాస్’ సంస్థ, అలాగే గతంలో ఇళయరాజా – ఏ.ఆర్. రెహమాన్ – కీరవాణి లాంటి పలువురు సుప్రసిద్ధ సంగీత దర్శకుల లైవ్ షోలను నిర్వహించిన ‘దక్షిణ్ స్టోరీస్’ సంస్థ ఈ బృహత్తర ప్రయత్నంలో స్మితకు తోడుగా నిలిచి, ముందడుగు వేస్తున్నాయి. కొన్ని తరాలుగా సంప్రదాయ వస్త్రశ్రేణితో ముడిపడిన కంకటాల సంస్థ ఈ తత్త్వమసిలో తొలి సీజన్ అయిన ప్రథమ పాదాన్ని సమర్పిస్తోంది.“ఆదిశంకరుల ‘నిర్వాణ షట్కం’, అన్నమాచార్యుల కీర్తనలు, వేమన సాహిత్యం లాంటివన్నీ భవబంధనాలను తెంచుకొని విముక్తమై, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరిన మహోన్నతుల అద్భుత రచనలు. శతాబ్దాలుగా తెలుగు వారి జీవితంలో భాగమైపోయిన కాలాతీతమైన రచనలు. వాటి లోతైన అర్థం అవగాహన చేసుకొని, అందరికీ తెలిసేలా పాడడం నాకు ఆత్మతృప్తినిస్తోంది” అని స్మిత చెప్పారు. ఈ ప్రాచీన తత్త్వాలకు వాద్యగోష్ఠి, బాణీలలో వాయులీన విద్వాంసులు సాయి, అలాగే సుజన్, సహా ప్రతిభావంతులైన సంగీత కళాకారులు పలువురు పాలుపంచుకుంటూ ఉండడం విశేషం. అలాగే, స్మిత తదితర సినీ, కళా ప్రముఖులెందరో ఉంటున్న భారీ కమ్యూనిటీ గృహ సముదాయంలోనే నివసిస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి ఈ తత్త్వాలకు వీడియో చిత్రీకరణలో కీలక భూమిక వహించడం మరో విశేషం.అమ్మ, అమ్మమ్మల ప్రభావంతో...“మనం బయట వెతుకుతున్న సత్యం... ఇప్పటికే మనలోనే ఉందని గుర్తుచేసే శాశ్వత సందేశం ఈ తత్త్వమసి” అంటూ ఈ ప్రాజెక్టు విశేషాలను గాయని స్మిత ఇటీవల వెల్లడించారు. అత్యంత సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులతో పాటు ఆప్తులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల మధ్య ఆ ప్రారంభ పరిచయోత్సవం ఆత్మీయంగా జరిగింది. గాయకుడు హేమచంద్ర సంధానకర్తగా వ్యవహరించిన ఆ ఉత్సవంలో ప్రాజెక్ట్ పరిచయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్, స్మిత బృందం రూపొందించిన తత్త్వాల ఆడియో గ్లింప్స్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సత్యవాణి ఆవిష్కరించి, అభినందించారు. కొన్ని తత్త్వాల దృశ్యఖండికలను వెండితెరపై ప్రత్యేకంగా ప్రదర్శించారు.తత్త్వాలను పాడుతున్నప్పుడు వాటి వీడియో చిత్రీకరణతో పాటు ఆ పాటల భావార్థాలను పక్కనే ఇంగ్లీషు లిపిలో వేయడం విశేషం. తెలుగు తెలియనివారికి కూడా ఆ తత్త్వాల అంతరార్థం తెలిసేందుకు ఈ ఆలోచన ఉపకరిస్తుంది. “స్మిత ఆలోచన, ఆచరణ ఏదైనా మితంగా ఉండదు. అపరిమితంగా ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞ గల అమ్మమ్మ తేళ్ళ లక్ష్మీకాంతమ్మ, అమ్మ జోగులాంబల ప్రభావం స్మితపై ఎంతో ఉంది. ‘నాదాధీనం జగత్సర్వం’ అన్నారు పెద్దలు. ఆ నాదాన్ని పట్టుకొని, ఈ తరానికి ఆమె అందిస్తున్న అద్భుతమైన ఆధ్యాతిక ఔషధ గుళిక ఈ ‘తత్త్వమసి’ ” అని సత్యవాణి అనర్గళంగా ఉపన్యసిస్తూ, గాయనిని ఆశీర్వదించారు. “స్మిత ఓ లేడీ అపరిచితుడు!”: హీరో నానిప్రముఖ హీరో నాని ఈ తత్త్వాల ఆలోచనను అమితంగా మెచ్చుకున్నారు. “నాకు రక్తసంబంధీకులైన అక్కాబావ ఒకరైతే, దేవుడిచ్చిన అక్కాబావలు స్మిత దంపతులు. నా దృష్టిలో చాలామంది కన్నా భిన్నమైన, అరుదైన వ్యక్తి స్మిత. ఏ మాత్రం అలసిపోకుండా, ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో పాప్ గీతాలు పాడుతూ, డ్యాన్సులు చేసే అదే వ్యక్తి... ఎంతో భక్తి, వేదాంతాలతో అంతే అద్భుతంగా ఇలా తత్త్వాలూ పాడుతుంది. (చమత్కార ధోరణిలో...) నిజం చెప్పాలంటే, శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’ చిత్రంలో లాగా ఆమె ఓ లేడీ అపరిచితుడు. మా కమ్యూనిటీలోని స్మిత వాళ్ళ ‘బి-10’ ఫ్లాట్ తలుపు తడితే... (నవ్వుతూ...) ఆమె ఎప్పుడు శుద్ధ సంప్రదాయ రామాచారి ఫక్కీలో తలుపు తీస్తుందో, ఎప్పుడు ఆధునిక కాలపు రెమో ధోరణిలో వ్యవహరిస్తుందో తెలియదు. అందుకే, ఆమె ఓ సెపరేట్ పీస్” అని నాని తన మనోభిప్రాయాలు పంచుకున్నారు.నిజానికి, పాటలు, ఇలాంటి తత్త్వాలంటే చెవి కోసుకునే హీరో నానితో కూడా ఈ తత్త్వాలలో గొంతు కలిపేలా చేయాలని స్మిత భావించారట. కానీ, హీరో నాని మాత్రం “నాకు పాటలు వినడం చాలా ఇష్టం. అలాగని నన్ను పాడమంటే ఎలా” అంటూ సున్నితంగానే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. లేదంటే, హీరో నాని గొంతు కూడా ఈ వినూత్న ప్రాజెక్ట్‌లో వినిపించేంది. వైజాగ్ సహా వివిధ ప్రాంతాల్లో త్వరలో లైవ్ షోస్! “విజయవాడ రోజుల నుంచి గత 40 ఏళ్ళుగా స్మిత నాకు బాగా తెలుసు. అయిదేళ్ళ వయసుకే తాను ఏమవుతానో చెప్పేది. నటి, ప్లేబ్యాక్ సింగర్, పాప్ సింగర్... ఇలా ఏ వయసుకు ఆ వయసులో ఎప్పటికప్పుడు తాను అవదలుచుకున్నదల్లా చెప్పేది. చెప్పిందల్లా చేసి, చూపించింది. దటీజ్ స్మిత” అని నిర్మాత స్వప్నాదత్ తన చిరకాల అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. స్వప్నాదత్ సహా సినీ ప్రముఖులు నాని, ఐశ్వర్యా రాజేశ్, అల్లరి నరేశ్, సుబ్బరాజు, దర్శకులు నాగ్ అశ్విన్, దేవా కట్టా, స్మిత భర్త శశాంక్ కంచర్ల, తల్లి జోగులాంబ, తదితరులు కలసి ‘తత్త్వమసి’ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. “ఎవరి మాటా వినని సీతయ్య లాగా... ఎవరి మాటా వినదు స్మితక్క. నచ్చినది చేసుకుంటూ ముందు వెళుతుంది” అంటూ ‘అల్లరి’ నరేశ్ చమత్కరించారు. “ఈ తత్త్వాల ప్రయోగం తర్వాత యోగి వేమన లాగా యోగిని స్మిత అంటారేమో” అని సుబ్బరాజు ఛలోక్తి విసిరారు. “ఈ తత్త్వాల వీడియో నాకు కళ్ళు తెరిపించే అనుభవం. పాటల గానంతో పాటు ఆ పాటల చిత్రీకరణ వేళ ఆధ్యాత్మికతను ప్రతిఫలిస్తూ స్మిత చేసుకున్న వస్త్రధారణ, అలంకరణ కూడా కళ్ళకు ఇంపుగా ఉన్నాయి” అని హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ జనం నవ్వుల మధ్య, స్మితకు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. స్మితతో పుష్కరకాలం క్రితం పరిచయమై, ఇప్పుడు ఆ పరిచయమే ఓ ప్రపంచంగా మారిపోయిందంటున్న దర్శకుడు దేవా కట్టా మాటల్లో చెప్పాలంటే, “స్మిత ఓ ర్యాడికల్. ఎప్పుడూ ఒకే పని చేస్తూ కూర్చుండిపోకుండా, నూతనత్వం వైపు ప్రయాణించే వ్యక్తి. స్థిరపడిపోయిన భావాలపై తిరుగుబాటు చేసే రెబెలియన్. ఒకసారి నిర్ణయం తీసుకుంటే, ఎంత కష్టమైనా సరే అనుకున్నది చేసే తీరే రకం”. వరుసగా వంద వారాల్లో 100 తత్త్వాల ఆడియో, వీడియో విడుదల, వివిధ ప్రాంతాల్లో షోల నిర్వహణ లాంటి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రయత్నానికి బహుశా అలాంటి వ్యక్తిత్వం, కృత నిశ్చయమే కావాలి. ఈ విషయంలో ‘తత్త్వమసి’ (అది నువ్వే) అంటున్న శ్రేయోభిలాషులతో పాటు తానూ అదే బలంగా నమ్ముతున్న స్మితకు ఆల్ ది బెస్ట్!పాతికేళ్ళ పైచిలుకు క్రితమే తెలుగు పాప్ పాటల రంగంలో ‘హాయ్ రబ్బా’ అంటూ తొలి ఆల్బమ్‌తోనే సంచలనం రేపిన చరిత ఆమెది. ఇప్పుడీ ‘తత్త్వమసి’ పేరిట హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలతో పాటు, విదేశాల్లోనూ స్మిత చేయదలుచుకున్న ఈ అనుభూతి ప్రధాన తత్త్వాల ప్రత్యక్ష కచ్చేరీలు సైతం మరో ట్రెండ్ సృష్టిస్తాయేమో చూడాలి. “ఇది కేవలం ఆడియో ఆల్బమ్ కాదు... అలాగని వీడియోనే కాదు... సంప్రదాయ సంగీత కచ్చేరీ కాదు... ప్రవచనాల బోధ కాదు... ప్రజల మనసుకు దగ్గరై, వారిని అనుభూతికి లోను చేసే ప్రత్యక్ష ప్రదర్శన” అంటున్నారు స్మిత. ఆమెకు అన్ని విషయాల్లో అండగా నిలిచే ఆమె భర్త ఓ సామాన్య శ్రోతగా అన్నట్టు, “పరుగులు తీస్తున్న ఈ ఆధునిక, రణగొణధ్వనుల ప్రపంచంలో జీవితం లోతుల్ని మనకు తెలియజెప్పడం ఓ గొప్ప ప్రయత్నం. కచ్చితంగా అత్యుత్తమమైన మంచి ప్రయత్నం.” జీవిత పరమార్థం ఏమిటో, ఆ పరమ లక్ష్యాన్ని ఎలా చేరాలో గుర్తుచేసే గీతాలుగా ‘తత్త్వమసి’ ఆధునికులకు అవసరమైన ప్రయోగమే!- రెంటాల జయదేవ -
పాటల ప్రపంచంలోకి...
ఆనందానికిపాట... ఆరోగ్యానికిపాట... కల్యాణానికిపాట... కలలకుపాట... విషాదానికిపాట... వినోదానికిపాట... స్ఫూర్తికిపాట... సందేశానికిపాట... ఇలా మనిషి జీవితంలో ప్రతి సందర్భానికీపాట ఉంటుంది. అందుకేపాట సృష్టించేవాళ్లన్నా, సాహిత్యం అందించేవాళ్లన్నా, ఆపాటకు తమ గాత్రంతో ప్రాణం పోసేవాళ్లన్నా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలా వెండితెర కోసం పసందైనపాటలతో ప్రేక్షకులను అలరించిన మ్యూజికల్ స్టార్స్ ఎందరో ఉన్నారు. హాలీవుడ్లో ఇలాంటి స్టార్స్ జీవితాలపై ‘బయోపిక్స్’ రూపొందుతున్నాయి. బయోపిక్స్ రూపొందడం కామన్. అయితే ఒకేసారి అరడజనుకి పైగా మ్యూజికల్ బేస్డ్ బయోపిక్స్‌కి శ్రీకారం జరగడం విశేషం. ఆ మ్యూజికల్ స్టార్స్ వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఈ చిత్రాలు ఆవిష్కరించనున్నాయి. ఇక థియేటర్స్‌లో కూర్చున్న ప్రేక్షకులనుపాటల ప్రపంచంలోకి తీసుకెళ్లే ఆ ‘మ్యూజికల్ బయోపిక్స్’ విశేషాలు తెలుసుకుందాం.ఏప్రిల్ 24న మైఖేల్ పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ప్రపంచం కోసం వదిలి వెళ్లినపాటల రూపంలో జీవించే ఉన్నారు. ఆయన జీవితంలోని కీలక విషయాలను వెండితెరపై చూసే సమయం ఆసన్నమైంది. ‘మైఖేల్’ టైటిల్‌తో రూపొందిన ఈ బయోగ్రఫీలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూసినవాళ్లు జాఫర్ అచ్చం తన బాబాయిలానే ఉన్నాడని పేర్కొనడంతో లుక్ పరంగా మార్కులు కొట్టేశారు జాఫర్. ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గ్లాడియేటర్, ది ఏవియేటర్’ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించిన జాన్ లోగన్ ‘మైఖేల్’ స్క్రిప్ట్ రాశారు.గ్రాహం కింగ్ ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. ‘‘మైఖేల్ జీవితాన్ని నిజాయతీగా చూపించాలన్నది మా లక్ష్యం. అలానే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం’’ అని గ్రాహం పేర్కొన్నారు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ‘మైఖేల్’ విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ‘ది జాక్సన్: యాన్ అమెరికన్ డ్రీమ్’ పేరిట ఐదు గంటల మినీ సిరీస్ రెండు భాగాలుగా ఏబీసీ టెలివిజన్‌లో ప్రసారమైంది.మైఖేల్ జాక్సన్ బతికి ఉన్నప్పుడే 1992లో ఈ సిరీస్ రూపొందింది. జాక్సన్, అతని కుటుంబం, అతని సోదరులు మ్యూజికల్ ఫీల్డ్‌లో ఎలా ఎదిగారు వంటి విశేషాలతో ప్రధానంగా ఈ సిరీస్ రూపొందింది. సో... హాలీవుడ్ చెబుతున్న ప్రకారం మైఖేల్ జాక్సన్ జీవితంపై రానున్న సమగ్ర చిత్రం ‘మైఖేల్’ అని తెలుస్తోంది. ఇక 50 ఏళ్ల వయసులో 2009 జూన్ 25న మైఖేల్ మరణించిన విషయం తెలిసిందే. ఈ పాప్ కింగ్పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.హూ ఈజ్ దట్ గర్ల్‘‘నా కంటే నా కథను ఎవరు బాగా రాయగలరు... చూపించగలరు’’ అంటున్నారు మడోన్నా. ‘క్వీన్ ఆఫ్పాప్’గా పేరు తెచ్చుకున్న మడోన్నా తన జీవితంతో ‘హూ ఈజ్ దట్ గర్ల్’ టైటిల్‌తో సినిమా నిర్మించాలని ఐదేళ్ల క్రితమే అనుకున్నారు. 2020లోనే ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలుపెట్టారామె. తానే దర్శకత్వం వహించాలనుకున్నారు కూడా. అయితే 2020 నుంచి 2023 వరకూ ఎలాంటి అప్డేట్ రాలేదు. 2024లో తాను ఈ సినిమాకి స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్లు పేర్కొని, కొన్ని ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేశారు మడోన్నా.సంగీతమే తనను నడిపించింది కాబట్టి ఈ సినిమా ఫోకస్ మొత్తం మ్యూజిక్ పైనే ఉంటుందని కూడా పేర్కొన్నా రామె. అయితే గడచిన ఐదేళ్లల్లో ఆమె ప్లాన్ చేసుకున్న మ్యూజికల్ ట్యూర్స్, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ ఏడాది ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లాలని మడోన్నా అనుకుంటున్నారట. మడోన్నాపాత్రను జూలియా గార్నర్ చేయనున్నారు. ‘‘నేను ట్రైన్డ్ డ్యాన్సర్‌ని, సింగర్‌ని కాదు. అందుకని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాను. నా నటనతో మడోన్నాని మెప్పించాలనుకుంటున్నాను’’ అని గార్నర్ పేర్కొన్నారు. వన్ డైరెక్టర్... ఫోర్ బయోపిక్స్ఒక డైరెక్టర్ ఒక బయోపిక్ చేయడం అంటే అది పెద్ద విషయమేం కాదు. కానీ ఒక దర్శకుడు నాలుగు బయోపిక్స్ చేయడం మాత్రం విశేషం అనే చె΄్పాలి. ఆ దర్శకుడు ఎవరంటే ‘సామ్ మెండిస్’. ‘ద బీటిల్స్’ అనే రాక్ బ్యాండ్ పై నాలుగు చిత్రాలు రూపొందించడానికి సామ్ సన్నాహాలు చేస్తున్నారు. 1960లో ఈ రాక్ బ్యాండ్ ఫామ్ అయింది. అప్పట్లో ఈ బ్యాండ్ చాలాపాపులర్. ‘ద బీటిల్స్’పై సినిమా అనేది తన కలల ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు దర్శకుడు సామ్ మెండిస్. ఈ రాక్ బ్యాండ్‌లోని సభ్యుల (పాల్ మెక్కార్ట్నీ, జాన్ లెన్నాన్, జార్జ్ హారిసన్, రింగో స్టార్) జీవితాలపై ఈ నాలుగు చిత్రాలు ఉంటాయి.ఒక్కో స్టార్ జీవితంతో ఒక్కో సినిమా ఉంటుంది. ఈ చిత్రాల్లోపాల్ మెక్కార్ట్నీగాపాల్ మెస్కల్, జాన్ లెన్నాన్ క్యారెక్టర్‌ను హ్యారిస్ డికిన్సన్, రింగో స్టార్పాత్రను బ్యారీ కియోగన్, జార్జ్ హారిసన్ క్యారెక్టర్‌ను జోసెఫ్ క్విన్ చేయనున్నారు. ‘ద బీటిల్స్ – ఎ ఫోర్ – ఫిల్మ్ సినిమాటిక్ ఈవెంట్’ టైటిల్‌తో ఈ నాలుగు చిత్రాలు రూపొందనున్నాయి. ఇక సాదా సీదా స్థాయి నుంచి స్టార్డమ్ వరకూ సంగీత ప్రపంచంలో ఎదగడానికి ‘ద బీటిల్స్’ రాక్ బ్యాండ్ చేసిన కృషి నేపథ్యంలో ఈ చిత్రాలు ఉంటాయి. ఈ నాలుగు చిత్రాలనూ 2028లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. గాడ్ మదర్ ఆఫ్ రాక్ అండ్ రోల్ అమెరికన్ సంగీత చరిత్రలో సింగర్‌గా, రైటర్‌గా, గిటారిస్ట్‌గా అత్యంత ప్రభావం చూపినవారిలో సిస్టర్ రోసెట్టా థార్పే ఒకరు. 1915లో పుట్టారు రోసెట్టా. అయితే 1921లోనే తన తల్లితో కలిసి మ్యూజికల్ ట్రూప్‌లో సింగింగ్ టాలెంట్‌ని చూపించడంతోపాటు గిటారిస్ట్గానూ భేష్ అనిపించుకుంది చిన్నారి రోసెట్టా. పెద్దయ్యాక సంగీత ప్రపంచంలో దూసుకెళ్లారామె. ముఖ్యంగా 1930–1940 మధ్యకాలంలో అప్పటి తరం శ్రోతలను తనపాటలతో అలరించారు. అంతటి ప్రతిభాశాలి అయిన సిస్టర్ రోసెట్టా థార్పే జీవితం ఆధారంగా ‘ఎ రోసెట్టా’ చిత్రం రూపొందనుంది. ‘గాడ్ మదర్ ఆఫ్ రాక్ అండ్ రోల్’గా పేరు పొందిన రోసెట్టా క్యారెక్టర్‌ను ఆమె బయోపిక్‌లో సింగర్, ర్యాపర్, నటి‡లిజ్జో పోషించనున్నారు. అలాగే ఈ చిత్రానికి ఓ నిర్మాతగానూ వ్యవహరించనున్నారామె. అయితే ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.బీ మై బేబీఅమెరికన్ మ్యూజికల్ డ్రామా ‘ది గ్రెటెస్ట్ షో మేన్’లో నటించడంతోపాటు తన గాత్రాన్ని వినిపించి, మరింతగా ఆకట్టుకున్నారు జెండయా. మంచి నటిగా, గాయనిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఓ మ్యూజికల్ ఫిల్మ్‌లో నటించనున్నారు. ‘బీ మై బేబీ’ టైటిల్‌తో దివంగత ప్రముఖ గాయని రోనీ స్పెక్టర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో రోనీ స్పెక్టర్పాత్రను జెండయా చేయనున్నారు. బ్యారీ జెంకిన్స్ దర్శకత్వం వహించనున్నారు. కాగా... రోనీ స్పెక్టర్ అంటే తనకెంతో అభిమానం అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు జెండయా. 2022లో రోనీ మరణించినప్పుడు నివాళి అర్పిస్తూ, ఎంతో భావోద్వేగానికి గురయ్యారు జెండయా. కెమెరా ముందు రోనీగా ఒదిగిపోవడానికి ఎంత కృషి చేయాలో అంతా చేస్తానంటున్నారామె.బాయ్ జార్జ్ జీవితంతో... 1980లలో తమ గాత్రంతో శ్రోతలను ముగ్ధులను చేసిన గాయకుల్లో బాయ్ జార్జ్ ఒకరు. వేరే రచయితలతో కలిసి బాయ్ జార్జ్ రాసిన ‘టేక్ ఇట్ లైక్ ఎ మ్యాన్’, ‘స్ట్రైట్’, బాయ్ జార్జ్ మాత్రమే రాసిన ‘ఎ కర్మ’ ఆటోబయోగ్రఫీల ఆధారంగా బాయ్ జార్జ్ బయోపిక్ రూపొందనుంది. బాయ్ జార్జ్పాత్రను సోఫీ టర్నర్ చేసే అవకాశం ఉందట. దర్శకుడు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే... బాయ్ జార్జ్ అబ్బాయి కాబట్టి... ఆపాత్రను అబ్బాయే చేయాలని, నటి సోఫీ టర్నర్‌తో ఎందుకు చేయించాలనుకుంటున్నారనే చర్చ హాలీవుడ్లో జరుగుతోంది. అయితే తనపాత్రకు సోఫీ టర్నర్ పూర్తి న్యాయం చేస్తుందని నమ్ముతున్నానని బాయ్ జార్జ్ అంటున్నారు. ‘‘నాపాత్రను సోఫీ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ... ‘ఆమె మీపాత్ర చేయలేదు... ఆమె ఒక మహిళ...’ అని అందరూ అంటున్నారు. అయితే నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఆమెపాత్ర చేయాలనుకున్నాను. నాకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు నా బయోపిక్‌లో ఆమె నాపాత్ర చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది’’ అని బాయ్ జార్జ్ అంటున్నారు.ఈ చిత్రాలు మాత్రమే కాదు... దివంగత డ్రమ్మర్ కీత్ మూన్ బయోపిక్, అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, పియానిస్ట్ బిల్లీ జోయెల్ జీవితం ఆధారంగా... ఇలా పలు బయోపిక్స్ రానున్నాయి. – డి.జి. భవాని -
పాటలు పాడే రోడ్డు.. కారు నడిపితే రోడ్డుపై నుంచి మ్యూజిక్
రోడ్డు అంటే మనకు గుర్తొచ్చేది ట్రాఫిక్, హారన్లు, స్పీడ్ బ్రేకర్లు. కానీ ప్రపంచంలో కొన్ని చోట్ల రహదారులే సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. వీటినే 'మ్యూజికల్ రోడ్స్' అంటారు. ప్రత్యేకంగా రూపొందించిన రంబుల్ స్ట్రిప్స్.. అంటే రోడ్డుపై పొడవైన కమ్మీలు లేదా గీతలు.. కారు వాటిపై నుంచి దూసుకెళ్తే వైబ్రేషన్ ద్వారా సంగీతాన్ని సృష్టిస్తాయి. సాధారణంగా ఇవి డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ సృజనాత్మక ఆలోచనతో అదే స్ట్రిప్స్‌ను ప్రత్యేక దూరం, పొడవుతో అమర్చితే, కారు వెళ్లే వేగాన్ని బట్టి అవే ఒక మెలోడియస్ ట్యూన్‌గా మారిపోతాయి.ఇలా పాడే రహదారుల్లో అమెరికా ముందుంది. కాలిఫోర్నియాలోని లాంకాస్టర్ నగరంలో 'సివిక్ మ్యూజికల్ రోడ్' పేరుతో ఒక ప్రత్యేక రహదారి ఉంది. హైవే 14 సమీపంలోని అవెన్యూ జీలో, 30వ , 40వ వీధుల మధ్య ఉన్న పావు మైలు పొడవైన ఈ సెక్షన్‌పై గంటకు 50 మైళ్ల వేగంతో డ్రైవ్ చేస్తే ప్రసిద్ధమైన 'విలియం టెల్ ఓవర్చర్' స్వరాలు వినిపిస్తాయి. రోడ్డుపై కారు వెళుతుంది కానీ వినిపించేది ఆర్కెస్ట్రా మ్యూజిక్!అసలు ఈ ప్రాజెక్ట్ 2008లో మొదట అవెన్యూ జీలో, నివాస ప్రాంతాలకు దూరంగా తిరిగి నిర్మించారు. హోండా సివిక్ బ్రాండ్ స్పాన్సర్ చేయడంతో దీనికి 'సివిక్ మ్యూజికల్ రోడ్' అనే పేరు వచ్చింది. స్వరంలో చిన్నచిన్న విరామాలు ఉన్నా ఆ అనుభూతి మాత్రం మరిచిపోలేనిది. ఇలా రోడ్డు నుంచి పాట వినేందుకు చాలా మంది డ్రైవర్లు ఒక్కసారే కాదు మళ్లీ మళ్లీ అదే రోడ్డుపై డ్రైవ్ చేస్తారు!ఇదే తరహాలో న్యూ మెక్సికోలో కూడా మరో మ్యూజికల్ రోడ్ ఉంది. చారిత్రాత్మక యూఎస్ రూట్ 66 సమీపంలోని టిజెరాస్ పట్టణం వద్ద, ఎన్ఎమ్ 333 రహదారిపై ప్రత్యేకంగా రూపొందించిన ఈ భాగంలో గంటకు 45 మైళ్ల వేగంతో డ్రైవ్ చేస్తే 'అమెరికా ది బ్యూటిఫుల్' స్వరాలు వినిపిస్తాయి. ఆ మెలోడి అంత స్పష్టంగా, అంత ప్రేరణాత్మకంగా ఉంటుంది కాబట్టి ప్రయాణం ఒక సంగీత యాత్రగా మారిపోతుంది.ఇలాంటి సంగీత రహదారులు జపాన్, దక్షిణ కొరియా, డెన్మార్క్, హంగేరీ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. కొన్ని జాతీయ గీతాలు ప్లే చేస్తాయి. కొన్ని క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తాయి. నిజానికి వీటిని డ్రైవింగ్ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు, డ్రైవర్లకు ప్రయాణాన్ని మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చడం వీటి లక్ష్యం. ఒక చిన్న ఇంజినీరింగ్ ఐడియా.. ఒక సాధారణ రోడ్డును మ్యూజిక్ స్టేజ్‌గా మార్చింది. ఇకపై రోడ్డుపై డ్రైవ్ చేస్తూ బోర్ కొట్టేస్తే ఎక్కడో ఒకచోట రహదారే మీ కోసం పాట పాడుతుందేమో! -
ఏఐతో సరిగమలు పలికించేలా రెహమాన్ వినూత్న ప్రాజెక్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్ సీక్రెట్ మౌంటైన్’ అనే వినూత్న సంగీత ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఇది మెటావర్స్‌లో వర్చువల్ ఏఐ ఆధారిత బ్యాండ్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రాజెక్ట్కులో భాగంగా ప్రత్యేకమైన డిజిటల్ సింఫనీ ద్వారా ప్రపంచ సంస్కృతులను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెహమన్ ఓ కార్యక్రమంలో చెప్పారు.సీక్రెట్ మౌంటైన్ అంటే ఏమిటి?ఇది ఆరుగురు సభ్యులున్న వర్చువల్ బ్యాండ్. ఇందులో ప్రముఖ సంగీత కళాకారులు కారా, బ్లెసింగ్, ఎకామ్, జెంటమ్, డేవిడ్, ఆఫియా ఉన్నారు. ఈ బ్యాండ్ పూర్తిగా మెటావర్స్‌లో ఉంటుంది. మెటావర్స్ అనేది ఒక సామూహిక వర్చువల్ స్పేస్. ఇందులో డిజిటల్ అవతార్లు వర్చువల్‌గా సాంకేతికతలను ఉపయోగించి పరస్పరం సంభాషించవచ్చు. కలిసి పాడవచ్చు. వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) కలయికతో ఇది పని చేస్తుంది. వీటిని ఉపయోగించి రెహమాన్ సంగీతాన్ని సృష్టించనున్నారు.ఏఐ, క్రియేటివిటీఏఐ సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగించబడుతుందని, అదే సమయంలో మానవ కళాత్మకతను ఇది భర్తీ చేయదని రెహమాన్ నొక్కి చెప్పారు. ఇందులో అవతార్లు ఉపయోగించినా సంగీతం, సాహిత్యం, స్వరాలు రియలిస్టిక్‌గా ఉంటాయన్నారు. ఏఐ మ్యూజిక్ ప్రోడక్షన్ను వేగవంతం చేస్తుందని చెప్పారు. ఇటీవల యూఎస్‌లో రెహమాన్ ఓపెన్ ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, పెర్ప్లెక్సిటీకి చెందిన అరవింద్ శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ వినూత్న ప్రాజెక్ట్‌కు సారథ్యం వహిస్తున్న రేడియంట్ సోల్స్ అనే సంస్థ సిలికాన్ వ్యాలీలోని ఏఐ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంది.ఇదీ చదవండి: ఎన్నికల వేళ రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల -
World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు?
నేడు (మార్చి 29).. ప్రపంచ పియానో దినోత్సవం(World Piano Day). పియానోను సంగీత కచేరీలలో ఉపయోగిస్తుంటారు. ఈ వాయిద్య పరికరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పియానోకు సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవు. పియానో దినోత్సవం సందర్భంగా ఈ సంగీత పరికరానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.పియానోను తొలిసారిగా 1709లో ఇటలీకి చెందిన హార్ప్సికార్డ్ తయారీదారు బార్టోలోమియో డి ఫ్రాన్సిస్కో క్రిస్టోఫోరీ కనుగొన్నారు. ఆయన రూపొందించిన పియానోలలో ఒకటి న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్(Metropolitan Museum of Art)లో భద్రపరిచారు. పియానో అనేది పియానోఫోర్ట్ అనే పదానికి సంక్షిప్త రూపం. పియానో అంటే మృదువైన, ఫోర్డ్ అంటే బిగ్గరగా.. దీని అర్థం ఏమిటంటే ఈ రెండు రకాల శబ్ధాలను పియానోపై పలికించవచ్చు.తొలినాళ్లలో పియానోలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. వీటిని దాదాపు ఒక శతాబ్దం పాటు ఒక నిర్దిష్ట తరగతికి చెందినవారు మాత్రమే కొనుగోలు చేయగలిగేవారు. నూతన పియానోను దాని కొత్త వాతావరణానికి, మారుతున్న రుతువులకు అనుగుణంగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఏడాదికి రెండుసార్లు ట్యూనింగ్(Tuning) చేస్తారు. పియానోలో మొత్తం 88 నలుపు రంగు, తెలుపు రంగు కీలు ఉంటాయి. పియానో క్లిష్టమైన వాయిద్య పరికరం. దీనిలో 12 వేలకు పైగా విడి భాగాలు ఉంటాయి.ప్రపంచంలో అతిపెద్ద పియానో 1.4 టన్నుల బరువు, 5.7 మీటర్ల పొడవు కలిగివుంది. దీనిని న్యూజిలాండ్ పియానో ట్యూనర్ అడ్రియన్ మాన్ రూపొందించారు. పియానో రెండు విధాలుగా ధ్వనిని అందిస్తుంది. మొదటిది బిగ్గరగా, రెండవది మెల్లగా ఉంటుంది. ఈ రెండు శబ్దాలు సరైన క్రమంలో ఉత్పత్తి అయినప్పుడు, శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. పియోనాను కీబోర్డ్ ఆధారంగా రూపొందిస్తుంటారు. దీనిలో ఏదైనా కీని గట్టిగా నొక్కితే పెద్ద శబ్దం వస్తుంది, అదే కీని మెల్లగా నొక్కినప్పుడు మృదువైన శబ్దం వస్తుంది.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్ -
అరిజోనాలో కనుల విందుగా రెట్రో నేపథ్య సంగీత వేడుక!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా ఆధ్వర్యంలో అద్భుతమైన రెట్రో నేపథ్య పార్టీ కనులవిందుగా ప్రారంబమైంది. అరిజోనాలోని ఫీనిక్స్‌లో జరిగిన ఈ మనోహరమైన సంగీతం ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ వేడుక భారతీయ సినిమా స్ఫూర్తిని, చలనచిత్ర వాతావరణాన్ని తీసుకువచ్చింది. భారతదేశం గొప్ప సంస్కృతి, వినోదాన్ని జరుపుకోవడానికి అన్ని వర్గాల నుంచి అతిథులు హాజరయ్యారు. 300 మందికి పైగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సినీ సంగీతం, ఫ్యాషన్ షో అలరించింది. అద్భుతమైన అలంకరణ, మిరుమిట్లు గొలిపే వెలుగులు, నేపధ్య సంగీతంతో గుర్తువుండిపోయే వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక ఆహ్లాదకరమైన నృత్య ప్రదర్శనలతో మారుమ్రోగింది. నటి లయ, గాయకుడు రఘు కుంచె తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. హాజరైన ప్రేక్షకులు భారతీయ వంటకాలు, పానీయాలను ఆస్వాదించారు. ఆటా ప్రాంతీయ డైరెక్టర్ రఘు ఘాడీ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సమాజ సేవను ప్రోత్సహించడం, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని జరుపుకోవడం కోసం ఈ సందర్భంగా ప్రణాళికలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కోఆర్డినేటర్లు చెన్నయ్య మద్దూరి, వంశీ ఏరువరం, శేషిరెడ్డి గాదె, సునీల్ అన్నపురెడ్డి, ఫరితొష్ పొలి, మహిళా చైర్ శుభ, బింద్య,నివేదిత ఘాడీ, తదితరులు ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ ఆటా టీమ్ ధన్యవాదాలు తెలిపింది. (చదవండి: న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు) -
Lumbini Park Photos: లుంబినీ పార్కులో మ్యూజికల్ ఫౌంటేన్ ప్రారంభం (ఫొటోలు)
-
మ్యూజికల్ ధమాకా
-
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ విషెస్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ న్యూ ఇయర్ సందర్భంగా మ్యూజికల్ న్యూఇయర్ శుభాకాంక్షలతో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన వాయిద్యం సితార్ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ సితార్ ప్లేయర్ కిషోర్‌ను పరిచయం చేశారు. అప్ కమింగ్ మూవీ రంగ్‌దే లోని సాంగ్‌ను కిషోర్ ప్లే చేసిన వీడియోను షేర్ చేస్తూ అభిమానులకు మ్యూజికల్ విషెస్ అందించారు. అందమైన సంగీత నూతన సంవత్సరంలో అద్భుతమైన ఆశలు, పప్రేమతో రంగులమయం కావాలంటూ ఆకాంక్షించారు. అలాగే ఈ సాంగ్‌ను రేపు(జనవరి 1, శుక్రవారం) విడుదల చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న రంగ్‌దే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ మ్యాజికల్ మెలోడీ సాంగ్‌ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. A small MUSICAL VIDEO for all of you.. To Step into a BEAUTIFUL MUSICAL NEW YEAR filled with AMAZING HOPE🙏🏻.. LOVE❤️& COLOURS..🌈#RangDe#RangDeRecordingSession#HappyNewYear2021 https://t.co/sBBEtdjEFs — DEVI SRI PRASAD (@ThisIsDSP) December 31, 2020 -
ఓలలాడించిన గాత్ర కచేరీలు
విశాఖ–కల్చరల్ :సంగీత ప్రియులను మైమరిపించే మధురమైన రెండు గాత్ర కచేరీలు ఓలలాడించాయి. తమ గానామతాలతో ప్రేక్షకుల మనస్సులను ఉల్లాస పరిచాయి. ఒకరు కర్ణాటక సంగీతం, మరోకరు హిందూస్తానీ గాత్రాలతో విశాఖ ప్రజల హదయాలను దోచుకున్నారు. సప్తస్వరాలు మీటే చక్కటి గళాలతో ఆలపించిన గాత్ర కచేరీల్లో పలు సంగీతరాగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ నెలవారీ నిర్వహించిన కచేరీల్లో భాగంగా శనివారం కళాభారతి ఆడిటోరియంలో భజన బహర్ పేరుతో కర్ణాటక, హిందూస్తానీ సంగీత కచేరీలు ఏర్పాటు చేశారు. తొలుత నిర్వహించిన కర్ణాటక కచేరిలో నగరానికి చెందిన డి. విజయలక్ష్మి గళం నుంచి జాలువారిన పలు కతులు సంగీతప్రియులను మధురానుభూతిని కలిగించాయి. గణేష్ స్తుతి గీతంతో విజయలక్ష్మి తన గాత్ర కచేరిని ప్రారంభించారు. రజని నిరాజని....రంజని రాగం/ఆదితాళం, సంగీత సామ్రాజ్య సంచరణి.... మోహినాకల్యాణి రాగం/ఆదితాళం వంటి గానాలు ఆలపించారు. ద్వితీయంగా అనుపమా త్రిపాఠీ ఆలపించిన హిందూస్తానీ గాత్ర కచేరిలో పలు ఆసక్తికరమైన కతులు రాగయుక్తంగా గాత్రం చేశారు. కీబోర్డు ఎ.ఎస్.జాన్, తబలా బి. ధనంజయ్, గిటార్ ఆర్.కష్ణరావు, ప్యాడ్ రామకష్ణ, హార్మోనియం పింటు చక్కటి వాద్య సహకారం అందించారు. అలసిన మనస్సుకు సంగీతం ఓ టానిక్ కళలలో అన్నింటికంటే సంగీత కళ అలసిన మనస్సులకు టానిక్‌ల పని చేస్తోందని తూర్పు రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ కొనియాడారు. వీఎండీఏ ట్రస్ట్ నగరంలో భారతీయ సాంస్కతిక, సంప్రదాయ కళారంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. యాధచ్చక జీవన విధానంలో నగరజీవుల హదయాలను ఉల్లాసం, ఉత్సాహం,హుషారు పరిచే కళా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వీఎండీఏ ట్రస్ట్‌ను కొనియాడారు. అనంతరం వీఎండీఏ ట్రస్ట్ తరఫున ప్రధాన కార్యదర్శి జీఆర్కే ప్రసాద్(రాంబాబు)డీఆర్ఎం చంద్రలేఖముఖర్జిని ఘనంగా సత్కరించారు. -
ప్యారిస్‌లో మ్యూజికల్ క్యాట్స్


