
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్ సీక్రెట్ మౌంటైన్’ అనే వినూత్న సంగీత ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఇది మెటావర్స్‌లో వర్చువల్ ఏఐ ఆధారిత బ్యాండ్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రాజెక్ట్‌కులో భాగంగా ప్రత్యేకమైన డిజిటల్ సింఫనీ ద్వారా ప్రపంచ సంస్కృతులను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెహమన్ ఓ కార్యక్రమంలో చెప్పారు.
సీక్రెట్ మౌంటైన్ అంటే ఏమిటి?
ఇది ఆరుగురు సభ్యులున్న వర్చువల్ బ్యాండ్. ఇందులో ప్రముఖ సంగీత కళాకారులు కారా, బ్లెసింగ్, ఎకామ్, జెంటమ్, డేవిడ్, ఆఫియా ఉన్నారు. ఈ బ్యాండ్ పూర్తిగా మెటావర్స్‌లో ఉంటుంది. మెటావర్స్ అనేది ఒక సామూహిక వర్చువల్ స్పేస్. ఇందులో డిజిటల్ అవతార్లు వర్చువల్‌గా సాంకేతికతలను ఉపయోగించి పరస్పరం సంభాషించవచ్చు. కలిసి పాడవచ్చు. వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) కలయికతో ఇది పని చేస్తుంది. వీటిని ఉపయోగించి రెహమాన్ సంగీతాన్ని సృష్టించనున్నారు.
ఏఐ, క్రియేటివిటీ
ఏఐ సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగించబడుతుందని, అదే సమయంలో మానవ కళాత్మకతను ఇది భర్తీ చేయదని రెహమాన్ నొక్కి చెప్పారు. ఇందులో అవతార్లు ఉపయోగించినా సంగీతం, సాహిత్యం, స్వరాలు రియలిస్టిక్‌గా ఉంటాయన్నారు. ఏఐ మ్యూజిక్ ప్రోడక్షన్‌ను వేగవంతం చేస్తుందని చెప్పారు. ఇటీవల యూఎస్‌లో రెహమాన్ ఓపెన్ ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, పెర్‌ప్లెక్సిటీకి చెందిన అరవింద్ శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ వినూత్న ప్రాజెక్ట్‌కు సారథ్యం వహిస్తున్న రేడియంట్ సోల్స్ అనే సంస్థ సిలికాన్ వ్యాలీలోని ఏఐ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంది.
ఇదీ చదవండి: ఎన్నికల వేళ రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల