ఓలలాడించిన గాత్ర కచేరీలు
సంగీత ప్రియులను మైమరిపించే మధురమైన రెండు గాత్ర కచేరీలు ఓలలాడించాయి. తమ గానామతాలతో ప్రేక్షకుల మనస్సులను ఉల్లాస పరిచాయి.
విశాఖ–కల్చరల్ :సంగీత ప్రియులను మైమరిపించే మధురమైన రెండు గాత్ర కచేరీలు ఓలలాడించాయి. తమ గానామతాలతో ప్రేక్షకుల మనస్సులను ఉల్లాస పరిచాయి. ఒకరు కర్ణాటక సంగీతం, మరోకరు హిందూస్తానీ గాత్రాలతో విశాఖ ప్రజల హదయాలను దోచుకున్నారు. సప్తస్వరాలు మీటే చక్కటి గళాలతో ఆలపించిన గాత్ర కచేరీల్లో పలు సంగీతరాగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ నెలవారీ నిర్వహించిన కచేరీల్లో భాగంగా శనివారం కళాభారతి ఆడిటోరియంలో భజన బహర్ పేరుతో కర్ణాటక, హిందూస్తానీ సంగీత కచేరీలు ఏర్పాటు చేశారు. తొలుత నిర్వహించిన కర్ణాటక కచేరిలో నగరానికి చెందిన డి. విజయలక్ష్మి గళం నుంచి జాలువారిన పలు కతులు సంగీతప్రియులను మధురానుభూతిని కలిగించాయి. గణేష్ స్తుతి గీతంతో విజయలక్ష్మి తన గాత్ర కచేరిని ప్రారంభించారు. రజని నిరాజని....రంజని రాగం/ఆదితాళం, సంగీత సామ్రాజ్య సంచరణి.... మోహినాకల్యాణి రాగం/ఆదితాళం వంటి గానాలు ఆలపించారు. ద్వితీయంగా అనుపమా త్రిపాఠీ ఆలపించిన హిందూస్తానీ గాత్ర కచేరిలో పలు ఆసక్తికరమైన కతులు రాగయుక్తంగా గాత్రం చేశారు. కీబోర్డు ఎ.ఎస్.జాన్, తబలా బి. ధనంజయ్, గిటార్ ఆర్.కష్ణరావు, ప్యాడ్ రామకష్ణ, హార్మోనియం పింటు చక్కటి వాద్య సహకారం అందించారు.
అలసిన మనస్సుకు సంగీతం ఓ టానిక్
కళలలో అన్నింటికంటే సంగీత కళ అలసిన మనస్సులకు టానిక్‌ల పని చేస్తోందని తూర్పు రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ కొనియాడారు. వీఎండీఏ ట్రస్ట్ నగరంలో భారతీయ సాంస్కతిక, సంప్రదాయ కళారంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. యాధచ్చక జీవన విధానంలో నగరజీవుల హదయాలను ఉల్లాసం, ఉత్సాహం,హుషారు పరిచే కళా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వీఎండీఏ ట్రస్ట్‌ను కొనియాడారు. అనంతరం వీఎండీఏ ట్రస్ట్ తరఫున ప్రధాన కార్యదర్శి జీఆర్‌కే ప్రసాద్(రాంబాబు)డీఆర్‌ఎం చంద్రలేఖముఖర్జిని ఘనంగా సత్కరించారు.