హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ విభాగంలో పరిశోధనలు, సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా విరూపాక్ష ఆర్గానిక్స్‌తో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్–హైదరాబాద్ (టీఐఆర్‌ఎఫ్‌హెచ్) చేతులు కలిపింది. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు విరూపాక్ష ఆర్గానిక్స్ ఎండీ చంద్రమౌళీశ్వర రెడ్డి తెలిపారు.
పరిశోధనల్లో టీఐఎఫ్‌ఆర్‌హెచ్ నైపుణ్యాలు, అలాగే ప్రాసెస్ డెవలప్‌మెంట్, తయారీలో విరూపాక్ష అనుభవం దన్నుతో ఇరు సంస్థలు ఆప్టోఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్‌పై పరిశోధనల నుంచి టూ–డైమెన్షనల్ మెటీరియల్స్ రూపకల్పన వరకు వివిధ అంశాల్లో కలిసి పని చేయనున్నట్లు ఆయన వివరించారు. పరిశోధనల ఫలితాలను మార్కెట్లోకి తెచ్చేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. మరోవైపు, ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో తమ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చంద్రమౌళీశ్వర రెడ్డి చెప్పారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 740 కోట్లు సమీకరించనుంది.


