మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి.. | youth finance eight money lessons must know | Sakshi
Sakshi News home page

మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..

Jun 26 2025 7:41 PM | Updated on Jun 26 2025 8:14 PM

youth finance eight money lessons must know

డబ్బుకు సంబంధించిన పాఠాలు నిత్యం చాలామంది చెబుతూంటారు. ‘ఎక్కువ పొదుపు చేయండి..తక్కువ ఖర్చు పెట్టండి..’ వంటి సలహాలను తరచుగా వింటుంటారు. కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్‌గా వాటి అర్థం ఏమిటో కొందరు మాత్రమే చెబుతారు. డబ్బు నిర్వహణ అంటే బడ్జెట్‌ను తయారు చేయడం మాత్రమే కాదు, ఏది అవసరమో..ఏది కాదో తెలుసుకుని మసులుకోవడం అని నిపుణులు చెబుతున్నారు. సీఏ నితిన్ కౌశిక్ 30 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎనిమిది ముఖ్యమైన డబ్బు పాఠాలను తెలిపారు.

నితిన్‌ తన లింక్డ్‌ఇన్‌లో రాసిన వివరాల ప్రకారం..‘ఎవరూ మీకు బోధించని 8 కఠినమైన డబ్బు సత్యాలు (అయితే ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల లోపు తప్పకుండా నేర్చుకోవాలి)ఇవి. డబ్బు ఆదా చేయడం అంటే ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు. తర్కంతో ఆలోచించి ఖర్చు చేయడం. చాలా మంది ఆలస్యంగా నేర్చుకునే నిజమైన వివరాలు ఇవి. కాబట్టి మీరు 30 ఏళ్లు దాటడానికి ముందే తెలుసుకోవాల్సిన ఎనిమిది కఠినమైన, నిజమైన డబ్బు పాఠాలను చూద్దాం’ అంటూ నితిన్‌ రాసుకొచ్చారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  • ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే క్వాలిటీ వస్తువులపై పెట్టుబడులు పెట్టాలి. చీప్‌గా వస్తుందని కొనుగోలు చేస్తే ఎక్కువసార్లు దాన్ని రీప్లేస్‌ చేయాల్సి వస్తుంది.

  • ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు భారీ ఫర్నిచర్ కొనవద్దు. ఎందుకంటే తరలింపు ఖర్చులు భారంగా మారుతాయి. దీర్ఘకాలిక ఖర్చులకు దారితీస్తూ, స్వల్పకాలిక పొదుపును నివారించే వాటికి దూరంగా ఉండాలని దీని ఉద్దేశం.

  • ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో మీ జీతంలో కనీసం 5 శాతాన్ని నగదు రూపంలో పొదుపు చేయండి. ఫిజికల్ మనీ మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేసేలా చేస్తుంది.

  • ఫోన్ ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకు లేటెస్ట్, ఖరీదైన ఫోన్ అవసరం లేదు. మీ పనులకు నిజంగా ఏది అవసరమో దాన్ని కొనుగోలు చేయండి. అంతకు మించి వద్దు. ఖరీదైన గాడ్జెట్లు త్వరగా వాటి విలువను కోల్పోతాయి.

  • చాలా మంది యువకులు తాము ఫిట్‌గా ఉన్నామని భావించి ఆరోగ్య బీమా తీసుకోరు. కానీ ఊహించని ఒక ఆసుపత్రి బిల్లు కనీసం ఆరు నెలల పొదుపును తుడిచివేస్తుంది. ఆర్థిక భద్రత అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు. ఊహించని ఖర్చుల నుంచి రక్షణ పొందడం అని గుర్తించాలి.

ఇదీ చదవండి: బంగారం కంటే వెండి ముద్దు

  • అనారోగ్యకరమైన ఆహార విధానం మీ శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా వైద్య బిల్లులను పెంచుతుంది. చక్కెర, పామాయిల్ తగ్గించాలి. అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి.

  • క్రెడిట్ కార్డు అనే ఉచితంగా వచ్చే డబ్బు కాదు. సరైన పద్ధతిలో వాడితే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ మీరు దీన్ని మీ ఆదాయ వనరుగా భావిస్తే అప్పుల్లో పడతారు.

  • డబ్బును గౌరవించే వారితో స్నేహం చేయండి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారితో సావాసం చేయాలి. డబ్బును అర్థం చేసుకోని వ్యక్తితో ఉంటే జీవితం దారుణంగా మారుతుంది. ప్రేమ ఒక్కటే ఉంటే ఈఎంఐలు చెల్లించలేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement