బంగారం కంటే వెండి ముద్దు | rich dad poor dad author Robert Kiyosaki on silver as his top investment | Sakshi
Sakshi News home page

బంగారం కంటే వెండి ముద్దు

Jun 26 2025 5:50 PM | Updated on Jun 26 2025 6:29 PM

rich dad poor dad author Robert Kiyosaki on silver as his top investment

విలువైన లోహంలో ఒకటిగా ఉన్న బంగారం ధరలు ఇటీవల కాలంలో 10 గ్రాములు రూ.1లక్షకుపైగా చేరింది. ఇంకోవైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్‌ భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో వీటి ధరలు ఆకాశాన్నంటినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండిలో పెట్టుబడిపెట్టే వారికి రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి సూచనలు చేశారు.

ఇప్పటికే బంగారం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత సమయంలో పుత్తడి కంటే వెండిపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చని కియోసాకి తెలిపారు. బంగారంతోపాటు బిట్‌కాయిన్‌ ధరలు పెరిగిన తరుణంలో అవి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాతే వాటిని కొనుగోలు చేస్తానని కియోసాకి తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. బంగారం, బిట్‌కాయిన్‌ ధరలు ఎప్పుడు పడుతాయోనని వేచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు సొంతంగా రిసెర్చ్‌ చేసి ఇన్వెస్ట్‌ చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి: టూవీలర్లపై టోల్‌ ఛార్జీలు..?

ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్‌ కియోసాకి ఇటీవల వెండి గురించి ఇటీవల సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ ‘నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం’ అని అభివర్ణించారు.

Advertisement
 
Advertisement
Advertisement