టూవీలర్లపై టోల్‌ ఛార్జీలు..? | Government Clarifies on Toll for Two Wheelers | Sakshi
Sakshi News home page

టూవీలర్లపై టోల్‌ ఛార్జీలు..?

Jun 26 2025 4:55 PM | Updated on Jun 26 2025 6:14 PM

Government Clarifies on Toll for Two Wheelers

ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం జులై 15 నుంచి టోల్ ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు సామాజిక మాధ్యమాలు, పలు మీడియా కథనాల్లోవార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ద్విచక్రవాహనాలపై ఛార్జీలు వేసే అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని, మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు జాతీయ రహదారులపై టోల్ ఫ్రీ సదుపాయం ఎప్పటిలాగే కొనసాగుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్‌ నెనేటర్‌

ఫాస్టాగ్ ఆధారిత టోల్‌ ఛార్జీలు ద్విచక్ర వాహనాలకు సైతం అమలు చేస్తారని సోషల్‌మీడియాలో సమాచారం వైరల్‌గా మారింది. దాంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈమేరకు స్పష్టతనిచ్చింది. మొదట టూవీలర్లపై టోల్‌ ఛార్జీలు విధిస్తున్నట్లు వచ్చిన అసత్య వార్తలవల్ల ద్విచక్రవాహనదారులు ఆందోళన చెందారు. కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వార్తలను ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఈ విషయంపై ఎటువంటి విధాన మార్పును ఆమోదించలేదని చెప్పారు. ఏ సవరణకైనా అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. అబద్ధపు ప్రచారానలు నమ్మకూడదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement