వారానికి 32 గంటలు చాలు..: యూఎస్‌ సెనేటర్‌ | Senator Bernie Sanders tying the rise of AI to a bold labor reform | Sakshi
Sakshi News home page

వారానికి 32 గంటలు చాలు..: యూఎస్‌ సెనేటర్‌

Jun 26 2025 3:48 PM | Updated on Jun 26 2025 4:44 PM

Senator Bernie Sanders tying the rise of AI to a bold labor reform

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల తొలగింపు అధికమవుతోంది. టెక్‌ కంపెనీలు వ్యయం ఆదా చేసుకొని ఇతర విభాగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఏఐ తోడ్పడుతుంది. కృత్రిమ మేధ వ్యాపారాలకు సహాయం చేస్తుంటే, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంటే ఆయా సంస్థలు ఉద్యోగుల వర్క్‌-లైఫ్‌ సమతుల్యతను మెరుగుపరచాలని సెనేటర్ బెర్నీ శాండర్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆటోమేషన్ పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేలా వాతావరణాన్ని సృష్టించాలన్నారు.

జో రోగన్ ఎక్స్‌పీరియన్స్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన బెర్నీ శాండర్స్ వారానికి 32 గంటల పనిదినాలు ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ ఉద్యోగులను నిరుద్యోగంలోకి నెట్టడం కంటే ఎక్కువ ఫ్రీటైమ్‌ ఉంచేలా చేయాలని పేర్కొన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వ్యాపారాలకు ఉత్పాదకత పెరుగుతోంది. దాన్ని ప్రధానంగా పరిగణిస్తే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దానికి బదులుగా పని దినాలను తగ్గించాలి. వారానికి 32 గంటలకు పనిని కుదించాలి. ఉద్యోగులు తమ కుటుంబం, స్నేహితులు లేదా తమకు ఇష్టమైన కార్యకలాపాలకు ఎక్కువ సమయం గడిపేందుకు వీలు కల్పించాలి. టెక్నాలజీ కేవలం కార్పొరేట్ లాభాలకే పరిమితం కాకుండా ఉద్యోగులకు సైతం ఉపయోగపడాలి’ అన్నారు.

ఇదీ చదవండి: ఇంటెల్‌లో ఉద్యోగాల కోత ప్రారంభం

సెనేటర్ బెర్నీ శాండర్స్ ప్రస్తుతం యూఎస్‌ సెనేట్‌లో వెర్మాంట్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1981లో వెర్మాంట్‌లోని బర్లింగ్ టన్ మేయర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1991 నుంచి 2007 వరకు అమెరికా ప్రతినిధుల సభలో పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement