ఐవోబీ లాభం హైజంప్‌ | IOB Q2 net profit jumps 56 Percentage to Rs 1963 crore | Sakshi
Sakshi News home page

ఐవోబీ లాభం హైజంప్‌

Oct 27 2026 4:48 AM | Updated on Oct 27 2026 4:48 AM

IOB Q2 net profit jumps 56 Percentage to Rs 1963 crore

క్యూ2లో రూ. 1,963 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 56 శాతం జంప్‌చేసి రూ. 1,963 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం, రుణ నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. గతేడాది(2025–26) క్యూ2లో కేవలం రూ. 1,259 కోట్లు ఆర్జించింది.

నికర వడ్డీ ఆదాయం 26 శాతం ఎగసి రూ. 3,867 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 3,059 కోట్లుకాగా.. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు స్వల్పంగా బలపడి 3.49 శాతాన్ని తాకాయి. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 56 శాతం జంప్‌చేసి రూ. 1,912 కోట్లను తాకింది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) కన్సెషనల్‌ స్వాప్‌ ద్వారా 1.12 బిలియన్‌ డాలర్లు(రూ. 11,000 కోట్లు) మొబిలైజ్‌ చేసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.83 శాతం నుంచి 1.19 శాతానికి తగ్గాయి. క్విప్‌ ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించనుంది.
ఐవోబీ షేరు  5.7 శాతం జంప్‌చేసి రూ. 30.34 వద్ద ముగిసింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement