
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితి గురించి బలమైన హెచ్చరిక జారీ చేశారు. మార్కెట్ పతనం వైపు పయనిస్తోందని, బాండ్ల వంటి సాంప్రదాయ పెట్టుబడులు చాలామంది నమ్ముతున్నంత సురక్షితం కాదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'బాండ్లు సురక్షితం' అని చెప్పినప్పుడు ఆర్థిక ప్రణాళికదారులు అబద్ధం చెబుతారు. మార్కెట్ క్రాష్‌లో ఏదీ సురక్షితం కాదు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగం క్రాష్ అవుతోందని కూడా రాబర్ట్ కియోసా హెచ్చరించారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ద్వారా యూఎస్ బాండ్లను డౌన్‌గ్రేడ్ చేస్తోందని, బాండ్లను కొనుగోలు చేయడానికి ఎవరూ రావడం లేదని ఆయన అన్నారు.
ఆసియాలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని కియోసాకి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ సంపదను నిల్వ చేసుకోవడానికి సురక్షితమైన ప్రదేశాల కోసం వెతకడం ప్రారంభించారు. వీరందరూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటివాటితో మాత్రమే కాకుండా.. చమురు, పశువుల కొనుగోలు వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారని కియోసాకి పేర్కొన్నారు. ఇవన్నీ ఆర్ధిక మాంద్యం సమయంలో రక్షణ కల్పిస్తాయని అన్నారు.
ఇదీ చదవండి: ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి
ఒక పెద్ద పతనం.. మహా మాంద్యం రాబోతోందని కియోసాకి చెబుతున్నారు. స్టాక్, బాండ్ హోల్డర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. కష్ట సమయాల్లో సంపదను కోల్పోయే బదులు, తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ఆలోచించి, సంపదను పెంచుకోవడానికి సహాయపడే నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
"మీరు మరింత ధనవంతులు అవుతారా? లేదా పేదవారు అవుతారా?.. అని ఆయన అనుచరులను ప్రశ్నిస్తూ, ప్రజలు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడంలో సహాయపడటమే తన లక్ష్యమని కూడా పేర్కొన్నారు అన్నారు.
Financial Planners lie when they sat “Bonds are safe.” There is nothing safe in a market crash.
The commercial real estate market is crashing.
Moodys down graded US bonds.
Asians buying gold.
No one is showing up to buy bonds.
I’ve been buying real gold, silver, and…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 7, 2025