
ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్, ఇతర పెట్టుబడుల గురించి సూచనలు చేసే అమెరికా వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు అంటూ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిట్‌కాయిన్ ఎవరినైనా ధనవంతులను చేస్తుంది. ఎలాంటి గందరగోళం లేదు, ఒత్తిడి లేదు. దాన్ని (బిట్‌కాయిన్) సెట్ చేసి మర్చిపో. నువ్వు ధనవంతుడైపోతావని అంటారు కియోసాకి. బిట్‌కాయిన్‌తో కోటీశ్వరులుగా మారడం చాలా సులభం అని మీరు చెబితే.. ఇన్ని లక్షల మంది పేదలు ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్నకు.. నేనే దానికి ఉదాహరణ అంటూ రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..
నేను (రాబర్ట్ కియోసాకి) నా మొదటి మిలియన్ సంపాదించడానికి చాలా కష్టపడ్డాను. నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా రిస్క్ తీసుకున్నాను, చాలా సమయం పట్టింది. మొదటి మిలియన్ సంపాదించినా తరువాత.. బిట్‌కాయిన్ గురించి కొంత అధ్యయనం చేసి, అందులో కొంత పెట్టుబడి పెట్టి మర్చిపోయాను. అదే మిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండానే మిలియన్స్ సంపాదిస్తున్నాను, మీకు కూడా అదే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. అయితే జాగ్రత్తగా ఉండాలని అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.
ANYONE CAN BECOME a MILLIONAiRE: I can’t believe how Bitcoin makes becoming rich so essy.
Bitcoin is Pure Genius asset design. No mess no stress. Just set it and forget it.
I made my first million in real estate. That took hard work, lots of risk, lots of money, lots of…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 6, 2025