
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఆర్థిక సంక్షోభం గురించి, బంగారం & వెండి కొనుగోలు గురించి, బిట్‌కాయిన్‌లో పెట్టుబడుల గురించి పలుమార్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ ముఖ్యమైన ప్రశ్న అంటూ.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మనం నియంత్రించే రెండు అత్యంత విలువైన ఆస్తులు.. మన సమయం, డబ్బు. వేలాది మంది ప్రజలు సమయాన్ని, డబ్బును తమ బాడీ, మైండ్, స్పిరిట్ కోసం కేటాయిస్తున్నారు. ఇది గొప్ప విషయమే. అయితే 'మీరు మీ సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?' అని తన ఎక్స్ వేదికగా ప్రశ్నింస్తూ.. జాగ్రత్తగా ఉండు అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి ప్రశ్నకు నెటిజన్లు కూడా తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.
At at Ken McElroy’s LIMITLESS Event in Dallas. Thousands of people..great speakers. Priceless. I have leaned a lot….not all of it pleasant.
Two most valuable assets we control….our time and our money.
Grateful that thousands of people give both their time and their…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 1, 2025