జూలైలో ‘సిల్వర్‌ బాంబ్‌’.. వెండిపై ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ రచయిత | Rich Dad Poor Dad author Robert Kiyosaki says Silver price will explode in July | Sakshi
Sakshi News home page

జూలైలో ‘సిల్వర్‌ బాంబ్‌’.. వెండిపై ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ రచయిత

Jun 28 2025 3:12 PM | Updated on Jun 28 2025 4:23 PM

Rich Dad Poor Dad author Robert Kiyosaki says Silver price will explode in July

అత్యధికంగా అమ్ముడైన పర్సనల్‌ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఇది వెండిపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కియోసాకి తన అధికారిక హ్యాండిల్‌లో పేర్కొన్నారు.

కియోసాకి వెండిని ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'గా అభివర్ణించారు. దాని అధిక రివార్డ్-టు-రిస్క్ సామర్థ్యాన్ని ఉదహరించారు."వెండి ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'. అంటే తక్కువ ప్రతికూల రిస్క్‌తో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయి' అని రాబర్ట్‌ కియోసాకి తన ట్వీట్లో పేర్కొన్నారు.

వైట్ మెటల్ తక్కువ ప్రతికూల రిస్క్ తో ఎక్కువ లాభాలను కలిగి ఉందని ఆయన వివరించారు. "ఈ రోజు ప్రతి ఒక్కరూ వెండిని కొనగలరు... కానీ రేపు కాదు" అన్నారు. తన సందేశాన్ని "గొప్ప పాఠం"గా అభివర్ణిస్తూ, తనను అనుసరించేవారికి గుర్తు చేశారు. "మీరు కొనుగోలు చేసినప్పుడు లాభాలు వస్తాయి... అమ్మినప్పుడు కాదు" అని సూచించారు.

వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో కియోసాకి ప్రకటన వెండి సమీప కదలికపై దృష్టిని మరింత పెంచింది. చాలా మంది ఇప్పుడు జూలైని నిశితంగా గమనిస్తున్నారు. విలువైన లోహాల మార్కెట్ ను గమనిస్తున్న విశ్లేషకులు కూడా వెండి జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement