
బ్యాంకులో డబ్బు ఉంటే పెద్దగా సంపద సృష్టి జరగదు. పైగా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి దాని విలువ తగ్గిపోతుంది. ప్రస్తుతం రూ.100కు కొనుగోలు చేసే వస్తువులను 10 ఏళ్ల తర్వాత కొనాలంటే అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సూత్రాన్ని తెలుపుతూ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కొన్ని విషయాలను తన ఎక్స్‌లో పంచుకున్నారు. కొన్ని విలువైన ఆర్థిక అంశాలను కొందరు చాలా శ్రద్ధతో విని పాటిస్తారని, ఇంకొందరు చాలా తేలికగా తీసుకుంటారని చెప్పారు.
‘పందులకు పాడటం నేర్పకండి.. ఇది మీ సమయాన్ని వృథా చేస్తుంది. దాంతోపాటు మీ వల్ల పందికి కూడా చికాకు కలుగుతుంది. నేను ఒక స్నేహితురాలితో మాట్లాడుతుంటే పొదువు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆమె, తన భర్త స్థానిక బ్యాంకులో డాలర్ల రూపంలో పొదుపు చేశామని చెప్పారు. అందుకు ఆమె చాలా గర్వపడింది. తన పొదుపు విలువ రానున్న రోజుల్లో తగ్గుతుందని ఎంతో హెచ్చరించాను. ఆమె తీరు పాడటం నేర్చుకోవడానికి ఇష్టపడని పందిలా మారింది. ఈ సంఘటన 1973లో హవాయిలో జరిగింది’ అన్నారు.
“DONT TEACH PIGS TO SING…. it wastes your time and you annoy the pig.”
I was talking to a friend….about my age….and she was so proud that she and her husband are holding their financial future in dollars, in their local bank.
When I attempted to caution her about the…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 4, 2025
ఇదీ చదవండి: ధూళి రాకుండా ‘గాలి మేడ’
‘అప్పటి నుంచి ఇప్పటివరకు డాలర్ విలువ 95 శాతం కోల్పోయింది. నేను గతంలో చేసిన హెచ్చరికలో భాగంగా ఆహారం ధర పెరుగుతుండడం గమనించారా అని ఆమెను అడిగాను. అప్పుడైనా అందులో దాగిఉన్న ద్రవ్యోల్బణ అంశాన్ని ఆమె గ్రహించలేకపోయింది. మీరందరూ నాతో ఏకీభవిస్తారని నేను ఆశించను. మీరు అనుసరిస్తున్న తీరును నేను అభినందిస్తాను. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న నా స్నేహితుల గురించి నాకు దిగులు లేదు. డబ్బును దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్యాంకు ఖాతాల్లో సేవ్ చేసేవారు లూజర్స్‌తో సమానం. ఈ విషయాలు నా పుస్తకంలోనూ రాశాను’ అని తెలిపారు.