
మనలో చాలామంది తమ ఊహలకు రూపం వచ్చేలా కల్పించుకొని చాలాసార్లు చేతులతో ‘గాల్లో మేడలు’ కడుతుంటారు. నిజంగా అలా గాల్లో మేడలు వెలిస్తే అదో అద్భుతం. అంతలా కాకపోయినా చైనా నేరుగా గాలితోనే మేడ కట్టింది. అవును.. చైనాలోని జినాన్ అనే ప్రాంతంలో ఓ నిర్మాణ స్థలంలో ధూళి, నిర్మాణ సమయంలో వెలువడే శబ్దాలను కట్టడి చేసేందుకు 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గాలితో బుడగలాంటి డోమ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈమేరకు ఓ వీడియో వైరల్‌గా మారింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ అధికారిక ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా దీనికి సంబంధించిన అంశాలు పంచుకున్నారు. అందులోని వివరాల ప్రకారం.. 50 మీటర్ల ఎత్తు, 20,000 చదరపు మీటర్ల గాలితో కూడిన డోమ్ నిర్మాణాన్ని చైనా ఆవిష్కరించింది. జినాన్‌లోని ఒక నిర్మాణ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ డోమ్ శబ్ద కాలుష్యం, ధూళి నుంచి చుట్టుపక్కల పర్యావరణాన్ని రక్షిస్తుంది. ప్రధాన కట్టడం పూర్తయ్యాక దాన్ని తొలగిస్తారు. సోషల్ మీడియాలో దీని వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో నెటిజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది యూజర్లు దీన్నో ‘చైనీస్ టెక్నోలాజియా’ అని అన్నారు.
🚨 China has built a 50m-tall inflatable dome over a construction site in Jinan to protect the surroundings from dust and noise. pic.twitter.com/CLSrZAWS2g
— Indian Tech & Infra (@IndianTechGuide) July 3, 2025
ఇదీ చదవండి: టాటా కొత్త ఈవీ తయారీ ప్రారంభం.. ధర ఎంతంటే..
‘చైనా ఇలాంటి నిర్మాణాలతో ప్రతిసారీ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది’ అని ఒక యూజర్ రిప్లై ఇచ్చారు. అయితే కొందరు మాత్రం ఈ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందులో పనిచేసే వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణం కింద కార్మికుల దుస్థితిని ఊహించండంటూ తెలుపుతున్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో లోపల ఉన్న కార్మికులను ఊపిరాడకుండా చేస్తుందని మరొకరు రాశారు. ఇది భూకంపం లేదా సునామీ కంటే ప్రాణాంతకం కావచ్చని మరొకరు రిప్లై ఇచ్చారు.