
టాటా మోటార్స్ అధికారికంగా ‘హారియర్.ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. కంపెనీ తన పుణె ప్లాంటులో ఈమేరకు ప్రొడక్షన్‌ను మొదలు పెట్టినట్లు పేర్కొంది. హారియర్.ఈవీ డెలివరీలు 2025 జులైలోనే ప్రారంభం కానున్నాయి. దాంతో కంపెనీ ఈమేరకు తయారీని మొదలుపెట్టినట్లు స్పష్టం చేసింది.
జూన్ 27న ఈ హారియర్.ఈవీ వేరియండ్ ధరలు ప్రకటించిన తరువాత వీటి కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. జులై 2న అధికారికంగా ఈ కార్ల బుకింగ్‌లు స్వీకరించింది. ఇప్పటికే భద్రత పట్ల దాని నిబద్ధతను చూపుతూ హారియర్.ఈవీ భారత్ ఎన్‌సీఏపీ 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. వయోజనుల భద్రతతో 32/32, పిల్లల రక్షణకు 45/49 మార్కును సాధించింది. ఈ విభాగంలో అత్యధిక భద్రతా స్కోర్లలో ఇది ఒకటి.
ఇదీ చదవండి: త్వరలో 50 శాతం వైట్‌కాలర్ జాబ్స్ కనుమరుగు
హారియర్.ఈవీ వివిధ కాన్ఫిగరేషన్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో రెండు బ్యాటరీ 65 కిలోవాట్, 75 కిలోవాట్ వేరియంట్‌లు ఉన్నాయి. రెండింటిలోనూ డిఫాల్ట్‌గా రియర్ వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) సింగిల్ మోటార్ సెటప్ ఉంది. అయితే 75 కిలోవాట్ వేరియంట్ మెరుగైన పనితీరు కోసం ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యుడీ) డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్ అందిస్తున్నట్లు పేర్కొంది. వేరియంట్‌ను అనుసరించి ఈ ఈవీ ధర రూ.21.49 లక్షలు(ఎక్స్‌షోరూమ్) నుంచి రూ.28.99 లక్షలు వరకు ఉంది.