రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..? | richdad poordad author robert kiyosaki why bought bitcoin for future | Sakshi
Sakshi News home page

రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?

Jun 17 2025 4:50 PM | Updated on Jun 17 2025 5:05 PM

richdad poordad author robert kiyosaki why bought bitcoin for future

ఎక్స్‌ వేదికగా రాబర్ట్‌ కియోసాకి పోస్ట్‌

రిచ్‌డాడ్‌ పూర్‌డాడ్‌ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి ప్రతిఒక్కరి భవిష్యత్తు కోసం ఉన్నతమైన ఆలోచనలు ఎప్పుడు చేయాలో తెలిపారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా ఈమేరకు కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. దాంతో ఈ పోస్ట్‌ కాస్తా వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో వైరల్‌గా మారింది.

ఎక్స్‌ వేదిక రాబర్ట్‌ కియోసాకి తెలిపిన పోస్ట్‌లో..‘మీ భవిష్యత్తు ఈ రోజే నిర్ణయించబడుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. దయచేసి దాన్ని వృథా చేయకండి. ఈ రోజు నేను మరింత బిట్ కాయిన్ కొనుగోలు చేస్తున్నాను. దాంతోపాటు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించి కొత్త పుస్తకంపై పనిచేస్తున్నాను. ఈ రోజు మీరు మీ భవిష్యత్తు కోసం ఏమి చేస్తున్నారు..? దయచేసి మీ ఈ రోజును గొప్ప రోజుగా మలుచుకోండి. జాగ్రత్త’ అని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపు

Advertisement
 
Advertisement
Advertisement