
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 'ఎల్ఐసీ బీమా సఖి యోజన'ను ప్రారంభించింది. దీని లక్ష్యం ఏమిటంటే.. మహిళలకు స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశాన్ని అందించడం మాత్రమే కాకుండా.. దీని ద్వారా వారికి సాధికారత కల్పించడం, బీమా అవగాహన.
ఎల్ఐసీ బీమా సఖి యోజన గురించి
దేశవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా.. ఎల్ఐసీ బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో మహిళలు బీమా సఖీలుగా మారడానికి శిక్షణ ఇస్తారు.
ఎల్ఐసీ బీమా సఖి పథకం మహిళలు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా సాధికారత వైపు అడుగులు వేయడానికి వీలు కల్పిస్తుంది. బలమైన మహిళలు, బలమైన భవిష్యత్తు అంటూ.. ఎల్ఐసీ ఇండియా ట్వీట్ చేసింది.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు
కనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కావలసిన డాక్యుమెంట్స్
➤జనన ధ్రువీకరణ పత్రం
➤అడ్రస్ ప్రూఫ్
➤విద్యా అర్హత సర్టిఫికేట్స్
➤లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
స్టైఫండ్ వివరాలు
ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్ రూ.7000, రెండో ఏడాది రూ.6000, మూడో ఏడాది రూ.5000 ఉంటుంది. అంతే కాకుండా.. నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్‌లు అందిస్తారు. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు
ప్రస్తుత ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ ఉద్యోగుల దగ్గర బంధువులు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు), పదవీ విరమణ చేసిన కార్పొరేషన్ ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
Strong Women, Stronger Futures!
LIC's Bima Sakhi scheme helps women build a brighter future, enabling them to take steps towards self-reliance and empowerment.
Swawalambi Naari,Khushhali Hamari#LIC #BimaSakhi #WomenEmpowerment pic.twitter.com/cVuY3Xha42— LIC India Forever (@LICIndiaForever) July 17, 2025