LIC Jeevan Dhara II Policy: ఎల్‌ఐసీ 'జీవన్​ ధార 2' పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్‌ఫిట్స్‌! | LIC Jeevan Dhara II policy launched | Sakshi
Sakshi News home page

LIC Jeevan Dhara II Policy: ఎల్‌ఐసీ 'జీవన్​ ధార 2' పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్‌ఫిట్స్‌!

Jan 21 2024 1:42 PM | Updated on Jan 21 2024 2:57 PM

LIC Jeevan Dhara II policy launched - Sakshi

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్​ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్‌ అందుబాటులోకి రానుంది.  

ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు (65/70/80 సంవత్సరాలు) మారుతుంటుంది.   అధికారిక ప్రకటన ప్రకారం.. యాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్‌ ఇన్‌ కమ్‌ పొందవచ్చు. 

జీవన్ ధార 2 పథకం వివరాలు 

►పాలసీ కట్టే సమయంలో  లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తిస్తుంది. 

►ఒకేసారి డిపాజిట్‌ చేసి (యాన్యుటీని) ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు. దీనిని మూడు, ఆరు నెలలు, ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు.   

►యాన్యుటైజేషన్ లేదా ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది.

► తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీ దారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి. 

► రెగ్యులర్ ప్రీమియం- వాయిదా కాలం 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు,

► సింగిల్ ప్రీమియం- వాయిదా కాలం 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు,

►యాన్యుటీ టాప్​-అప్​ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

►ఈ ఎల్​ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్​ తీసుకోవచ్చు.

►పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement