కోటక్‌.. ఇన్వెస్కో న్యూ ఫండ్‌ ఆఫర్స్‌ | New Mutual Fund NFO Kotak Invesco Launch three New Funds | Sakshi
Sakshi News home page

కోటక్‌.. ఇన్వెస్కో న్యూ ఫండ్‌ ఆఫర్స్‌

Nov 23 2026 3:04 PM | Updated on Nov 23 2026 3:07 PM

New Mutual Fund NFO Kotak Invesco Launch three New Funds

కోటక్‌ మహీంద్రా ఏఎంసీ తమ సిఫ్‌ ప్లాట్‌ఫాం కింద ఇన్ఫినిటీ ఈక్విటీ లాంగ్‌ షార్ట్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 1తో ముగుస్తుంది. ఇది సెక్యూరిటీల ఎంపికలో బాటమ్‌ అప్‌ వ్యూహాన్ని పాటిస్తుంది. అలాగే ఫ్యూచర్స్‌ షార్టింగ్, డీప్‌ అవుట్‌ ఆఫ్‌ ది మనీ ఆప్షన్స్‌ మొదలైన వ్యూహాలను ఉపయోగించి మెరుగైన రాబడులను అందించే ప్రయత్నం చేస్తుంది.

ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇన్ఫినిటీ హైబ్రిడ్‌ లాంగ్‌ షార్ట్‌ ఫండ్‌కి ఇది అదనంగా ఉంటుంది. మార్కెట్లో వివిధ పరిస్థితుల్లో విభిన్నమైన వ్యూహాలను పాటించాల్సి ఉంటుందని ఫండ్‌ మేనేజర్‌ (సిఫ్‌) కల్పేష్‌ జైన్‌ తెలిపారు. ప్రధానంగా లార్జ్‌ క్యాప్‌ ఈక్విటీలకి అనుబంధంగా ఆప్షన్స్, ఫ్యూచర్స్‌ని కూడా ఉపయోగించే అవకాశం ఈ పథకంలో ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో కనీసం రూ. 10 లక్షల నుంచి ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇన్వెస్కో నుంచి రెండు ఫండ్స్‌

ఇన్వెస్కో మ్యుచువల్‌ ఫండ్‌ కొత్తగా రెండు ఇండెక్స్‌ ఆధారిత ఫండ్స్‌ను ప్రవేశపెట్టింది. ఇన్వెస్కో ఇండియా బీఎస్‌ఈ టాప్‌ 10 బ్యాంక్స్‌ ఈటీఎఫ్, ఇన్వెస్కో ఇండియా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. దేశ ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి కీలకమైన ఈ రెండు రంగాల్లో ప్యాసివ్‌ విధానంలో పెట్టుబడులు పెట్టే  అవకాశాన్ని దక్కించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. బ్యాంక్స్‌ ఈటీఎఫ్‌ ప్రధానంగా బీఎస్‌ఈ టాప్‌ 10 బ్యాంక్స్‌ ఇండెక్స్‌లోని సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఇందులో భారత్‌లోని 10 భారీ లిస్టెడ్‌ బ్యాంకులు ఉంటాయి. ఇక రెండో ఫండ్‌ ముఖ్యంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌లోని సెక్యూరిటీస్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఈ సూచీలో ఐరన్, స్టీల్, అల్యుమినియం, కాపర్‌ తదితర మెటల్స్, మైనింగ్‌ రంగ సంస్థల షేర్లు ఉంటాయి. బ్యాంక్స్‌ ఈటీఎఫ్‌లో కనీసం రూ. 5,000 నుంచి, మెటల్‌ ఇండెక్స్‌ ఫండ్‌లో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

కోటక్‌ వేరియబుల్‌ ఇండెక్స్‌ యాన్యుటీ ప్లాన్‌

కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఆధారిత వేరియబుల్‌ ఇండెక్స్‌ యాన్యుటీ ప్లాన్‌ పేరిట రిటైర్మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. జీవితకాలం కచ్చితమైన యాన్యుటీ ఆదాయంతో పాటు ఇండెక్స్‌ ఆధారిత వృద్ధి ప్రయోజనాల అవకాశాలను కూడా అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్‌ ఉపయోగపడుతుందని సంస్థ సీడీవో పీయుష్‌ త్రివేది తెలిపారు. రిటైర్మెంట్‌ అనంతరం కూడా ఆర్థికంగా స్వతంత్రంగాను, చురుకైన జీవనశైలిని గడపాలని కోరుకునే వారు పెరుగుతున్న నేపథ్యంలో వారి అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. సుదీర్ఘ జీవితకాలం, ద్రవ్యోల్బణంపరమైన సవాళ్లను అధిగమించేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement