న్యూ ఫండ్‌ ఆఫర్స్‌: హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఐసీఐసీఐ వరకు.. | New Fund Offers: HDFC, ICICI, Franklin Templeton Launch New Funds | Sakshi
Sakshi News home page

న్యూ ఫండ్‌ ఆఫర్స్‌: హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఐసీఐసీఐ వరకు..

Nov 16 2026 3:38 PM | Updated on Nov 16 2026 3:50 PM

New Fund Offers: HDFC, ICICI, Franklin Templeton Launch New Funds

స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) విభాగానికి సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ మ్యుచువల్‌ ఫండ్‌ ప్రత్యేకంగా హెచ్‌–సిఫ్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. దీని కింద హైబ్రిడ్‌ లాంగ్‌ షార్ట్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. సురక్షితమైన డెట్‌ పేపర్స్, ఆర్బిట్రేజ్, రీట్స్, ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేయడంతో పాటు డెరివేటివ్స్‌ను ఉపయోగించడం ద్వారా మెరుగైన రాబడులు అందించే వ్యూహాలను ఇది అమలు చేస్తుంది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ నవంబర్‌ 27 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 10 లక్షలు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఐసీఐసీఐ లైఫ్‌ మొమెంటం క్వాలిటీ 50 ఫండ్‌

ఆర్థికంగా పటిష్టంగా ఉండి, షేరు ధరపరంగా సానుకూల ట్రెండ్స్‌ను కనపరుస్తున్న సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాన్ని కల్పించేలా ఐసీఐసీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ కొత్తగా ఐసీఐసీఐ లైఫ్‌ బీఎస్‌ఈ 500 మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది బీఎస్‌ఈ 500 కంపెనీల నుంచి మొమెంటం, క్వాలిటీ ప్రమాణాల ప్రాతిపదికన ఎంపిక చేసిన 50 సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు అందించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఐసీఐసీఐ లైఫ్‌ ప్రొటెక్ట్‌ ఎన్‌ గెయిన్, ఐసీఐసీఐ లైఫ్‌ సిగ్నేచర్‌ అష్యూర్‌ లాంటి పలు యులిప్స్‌ పథకాలతో ఈ ఫండ్‌ అందుబాటులో ఉంటుంది.

ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ ఈక్విటీ ఐఎఫ్‌ఎస్‌సీ ఫండ్‌

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ (ఇండియా) సంస్థ గిఫ్ట్‌ సిటీ ద్వారా తమ తొలి విదేశీ పెట్టుబడి ఫండ్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ ఈక్విటీ ఐఎఫ్‌ఎస్‌సీ ఫండ్‌. ఎఫ్‌టీజీఎఫ్‌ పుటా్నం యూఎస్‌ రీసెర్చ్‌ ఫండ్‌ అనే మాస్టర్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఫీడర్‌ ఫండ్‌గా ఇది ఉంటుంది. దీని ద్వారా కనీసం 5,000 డాలర్లను ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.  అంతర్జాతీయ స్థాయిలో డైవర్సిఫికేషన్‌కు ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement