హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నుంచి ‘కొత్త ఫండ్‌ ఆఫర్‌’ | New Mutual Fund NFOs Summit SIF HDFC 70 30 Index Fund | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నుంచి ‘కొత్త ఫండ్‌ ఆఫర్‌’

Oct 19 2026 1:43 PM | Updated on Oct 19 2026 1:46 PM

New Mutual Fund NFOs Summit SIF HDFC 70 30 Index Fund

ఒకే ఫండ్‌ ద్వారా ఈక్విటీలు, డెట్‌లో ఇన్వెస్ట్‌ చేసేలా నిఫ్టీ లార్జ్‌మిడ్‌క్యాప్‌ 250 ప్లస్‌ 8–13 ఇయర్‌ జీ–సెక్‌ 70:30 ఇండెక్స్‌ ఫండ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ మ్యుచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఇది 70% మొత్తాన్ని నిఫ్టీ లార్జ్‌మిడ్‌క్యాప్‌ 250 ఇండెక్స్‌లో, 30% నిఫ్టీ 8–13 ఇయర్‌ జీ–సెక్‌ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈక్విటీ విభాగంలో 100 లార్జ్‌ క్యాప్, 150 మిడ్‌ క్యాప్‌ కంపెనీలు ఉంటాయి.  డెట్‌కు సంబంధించి 8–13 ఏళ్ల మెచ్యూరిటీ గల టాప్‌3 లిక్విడ్‌ గవర్నమెంట్‌ బాండ్లలో పెట్టుబడులు పెడతారు. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ అక్టోబర్‌ 19తో ముగుస్తుంది. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.  

సమ్మిట్‌ యాక్టివ్‌ అసెట్‌ అలొకేటర్‌ ఫండ్‌

సమ్మిట్‌ సిఫ్‌ (Summit SIF) తాజాగా యాక్టివ్‌ అసెట్‌ అలొకేటర్‌ లాంగ్‌–షార్ట్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ అక్టోబర్‌ 26తో ముగుస్తుంది. ఇది ఈక్విటీలు, డెట్, డెరివేటివ్స్, ఇన్విట్స్, కమోడిటీ డెరివేటివ్స్‌ మొదలైన వాటిల్లో పరిస్థితులను బట్టి పెట్టుబడుల కేటాయింపులను మార్చడం ద్వారా మెరుగైన రాబడులు అందించడంపై దృష్టి పెడుతుంది. మార్కెట్‌ అంచనాలపై ఆధారపడటం కన్నా ఆర్బిట్రేజ్‌ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ వ్యూహం ఉంటుంది. ఇందులో 40%కి నిఫ్టీ 500 టీఆర్‌ఐ, 40%కి క్రిసిల్‌ షార్ట్‌ టర్మ్‌ బండా ఫండ్‌ ఇండెక్స్, 20 శాతానికి ఐకామ్‌డెక్స్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ బెంచ్‌మార్క్‌లుగా ఉంటాయి. కనీసం రూ. 10,00,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: మారే మార్కెట్లలో ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement