జీతం జమైతే వచ్చే ఆనందం.. ‘బత్తిస్ వాలీ స్మైల్’ | Bandhan Mutual Fund Battis Wali Smile salary wala plan swp | Sakshi
Sakshi News home page

జీతం జమైతే వచ్చే ఆనందం.. ‘బత్తిస్ వాలీ స్మైల్’

Oct 7 2026 9:50 PM | Updated on Oct 7 2026 9:55 PM

Bandhan Mutual Fund Battis Wali Smile salary wala plan swp

నెలాఖరులో ఉద్యోగులంతా ఎదురుచూసేది జీతం జమయ్యే రోజు కోసమే. ‘Salary Credited’ అంటూ ఫోన్‌లో నోటిఫికేషన్‌ కనిపించగానే ముఖంపై చిరునవ్వు రావడం సహజం. ఈ సాధారణ అనుభూతినే బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తన ‘శాలరీ వాలా ప్లాన్‌’ ప్రచారంలో భాగంగా కొత్తగా విడుదల చేసిన ‘బత్తిస్ వాలీ స్మైల్‌’ చిత్రంలో వినోదాత్మకంగా ఆవిష్కరించింది.

నెలలో 31వ తేదీ తర్వాత ఏం వస్తుందంటే.. 1వ తేదీ అని సాధారణంగా చెబుతాం. అయితే బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రచారంలో మాత్రం 31 తర్వాత ‘32’ వస్తుందనే సరదా భావనను ఉపయోగించింది. జీతం జమయ్యే సందేశం అందుకున్న వెంటనే వచ్చే పెద్ద చిరునవ్వును ‘బత్తిస్ వాలీ స్మైల్‌’గా అభివర్ణిస్తూ ప్రచారాన్ని రూపొందించింది.

ఈ ప్రచారం ద్వారా సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (SWP)ను సాధారణ పెట్టుబడిదారులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం చేసింది. SWP ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న వ్యవధుల్లో ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన పెట్టుబడికి మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

జీతభత్యాలు పొందే ఉద్యోగులతో పాటు వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, పదవీ విరమణ చేసినవారికీ క్రమం తప్పకుండా నగదు అవసరం ఉంటుంది. నెలనెలా ఖాతాలో డబ్బు జమయ్యే అనుభూతిని SWPతో అనుసంధానిస్తూ ‘శాలరీ వాలా ప్లాన్‌’ ప్రచారం రూపొందించినట్లు బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది. హాస్యం, రోజువారీ జీవితంలోని సుపరిచితమైన సందర్భాలను ఉపయోగించి పెట్టుబడి విధానాన్ని మరింత సులభంగా ప్రజలకు చేరువ చేయడమే ప్రచారం లక్ష్యంగా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement