యాక్సిస్‌, యూటీఐ.. న్యూ ఫండ్‌ ఆఫర్స్‌ | Axis UTI Mutual Fund NFO EVs Auto New-Age Consumption | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌, యూటీఐ.. న్యూ ఫండ్‌ ఆఫర్స్‌

Oct 26 2026 5:22 PM | Updated on Oct 26 2026 5:41 PM

Axis UTI Mutual Fund NFO EVs Auto New-Age Consumption

ఐదేళ్ల క్రితం 2021 ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 1 శాతం లోపే ఉండేది. అది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 9.4 శాతానికి పెరిగింది. ఇలాంటి పర్యావరణహిత వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్, కొత్త తరం వాహనాల విభాగంలో పెట్టుబడుల అవకాశాలను ఇన్వెస్టర్లు అందిపుచ్చుకునేందుకు వీలుగా యాక్సిస్‌ నిఫ్టీ ఈవీ అండ్‌ న్యూ ఏజ్‌ ఆటోమోటివ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రవేశపెట్టింది. అక్టోబర్‌ 30తో ఇది ముగుస్తుంది.

ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఆటోమోటివ్‌ వేల్యూ చెయిన్‌లోని వివిధ సెగ్మెంట్లలో పెట్టుబడి అవకాశాలను దీనితో అందుకోవచ్చని యాక్సిస్‌ ఏఎంసీ ఎండీ బి. గోప్‌కుమార్‌ తెలిపారు. దీనికి ప్రామాణికంగా పరిగణించే నిఫ్టీ ఈవీ అండ్‌ న్యూ ఏజ్‌ ఆటోమోటివ్‌ ఇండెక్స్‌లో ఈవీలు, కొత్త తరం ఆటోమోటివ్‌ టెక్నాలజీలను రూపొందిస్తున్న వాహనాల సంస్థలు, బ్యాటరీ మేకర్స్‌ తదితర ఆరు విభాగాలకు చెందిన సంస్థలు ఉంటాయి.

యూటీఐ ఎంఎఫ్‌ ‘న్యూ ఏజ్‌ కన్జంప్షన్‌’ ఇండెక్స్‌ ఫండ్‌

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా యూటీఐ నిఫ్టీ ఇండియా న్యూ ఏజ్‌ కన్జంప్షన్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది నవంబర్‌ 5 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. కొత్త తరహా వినియోగం థీమ్‌కి సంబంధించి నిఫ్టీ 500లోని కంపెనీల పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ప్యాసింజర్‌ కార్లు, ద్వి–త్రిచక్ర వాహనాలు, జ్యుయలరీ, వ్యాచ్‌లు, ఫిన్‌టెక్‌ సంస్థలు మొదలైనవి వీటిలో ఉంటాయి. నిఫ్టీ ఇండియా న్యూ ఏజ్‌ కన్జంప్షన్‌ ఇండెక్స్‌ ఫండ్‌లో ప్రస్తుతం 75 స్టాక్స్‌ ఉన్నాయని సంస్థ తెలిపింది. జీఎస్‌టీ క్రమబద్ధీకరణ, ఆదాయ పన్నుపరమైన మార్పులతో వినియోగానికి మరింత ఊతం లభించడమనేది ఈ కంపెనీలకు సానుకూలాంశమని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement