ఏపీఎల్‌ అపోలో చేతికి టాటా ట్యూబ్స్‌ బిజినెస్‌ | APL Apollo Tubes to Acquire Two Tata Steel Businesses for Rs 28000 Crore | Sakshi
Sakshi News home page

ఏపీఎల్‌ అపోలో చేతికి టాటా ట్యూబ్స్‌ బిజినెస్‌

Nov 23 2026 1:54 PM | Updated on Nov 23 2026 1:59 PM

APL Apollo Tubes to Acquire Two Tata Steel Businesses for Rs 28000 Crore

మెటల్‌ రంగ దిగ్గజం టాటా స్టీల్‌ స్టీల్‌ ట్యూబులు, పైపుల బిజినెస్‌సహా టాటా స్టీల్‌ కలర్స్‌(టీఎస్‌సీఎల్‌)ను ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌కు విక్రయించింది. రూ. 28,000 కోట్ల సంయుక్త విలువలో అమ్మివేసేందుకు బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాటా స్టీల్‌ తాజాగా వెల్లడించింది.

దీనిలో  స్టీల్‌ ట్యూబుల బిజినెస్‌ విలువ రూ. 11,700 కోట్లుకాగా.. టీఎస్‌సీఎల్‌లో 100 శాతం వాటా రూ. 16,300 కోట్లకు విక్రయించింది. ఇందుకు ఏపీఎల్‌ అపోలోతో వ్యాపార బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టాటా స్టీల్‌ పేర్కొంది. స్లంప్‌ సేల్‌ పద్ధతిలో ట్యూబుల బిజినెస్‌ తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ తదితరాలను విక్రయించినట్లు తెలియజేసింది. జంషెడ్‌పూర్, హోసూరు, ఖోపోలి, సాహిదాబాద్‌ ప్లాంట్లతోపాటు కోల్డ్‌ రోలింగ్, సర్ఫేస్‌ కోటెడ్‌ స్టీల్‌ ప్రొడక్ట్‌ యూనిట్లను బదిలీ చేయనున్నట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement