సిద్దిపేట వేదికగా కీలక పథకం.. రేపు సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన! | Revanth Reddy Indiramma Family Life Insurance Launch | Sakshi
Sakshi News home page

సిద్దిపేట వేదికగా కీలక పథకం.. రేపు సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన!

Nov 18 2026 10:33 PM | Updated on Nov 18 2026 10:33 PM

Revanth Reddy Indiramma Family Life Insurance Launch

సాక్షి, హైదరాబాద్‌: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలిచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సిద్దిపేట వేదికగా ‘ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ వార్షిక సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు సిద్దిపేట పట్టణంలో నిర్వహించే ర్యాలీలో పాల్గొని, ర్యాలీ ముగిసిన తర్వాత బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.

ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని అధికారికంగా ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇదీ చదవండి: సమైక్య పాలకుల కంటే రేవంత్‌ అధిక ద్రోహం : కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement