తెలంగాణ రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులకు భారీ ఊరట | Telangana RERA Orders Strict Action Against 17 Real Estate Projects | Sakshi
Sakshi News home page

తెలంగాణ రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులకు భారీ ఊరట

Nov 18 2026 7:57 PM | Updated on Nov 18 2026 7:57 PM

Telangana RERA Orders Strict Action Against 17 Real Estate Projects

సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఇల్లు లేదా ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన వినియోగదారులకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పెద్దపీట వేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల హక్కులను కాపాడేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. మొత్తం 17 కేసులకు సంబంధించి బిల్డర్లు, ప్రమోటర్లకు రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది.

బీహెచ్‌ఈఎల్‌ సొసైటీకి చెందిన 38 మంది సభ్యులకు వెంటనే ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని రెరా స్పష్టం చేసింది. వివాదాస్పద ‘రాకెట్రీ విల్లా’ ప్రాజెక్టులో ఎలాంటి విక్రయాలు జరపకూడదని బిల్డర్‌ను హెచ్చరించింది. జస్విత ఎస్టేట్స్‌, గూగీ టౌన్‌షిప్‌, ఎస్‌వీ ఎలక్ట్రానిక్‌ సిటీ-3, సిగ్నేచర్‌ టవర్స్‌, రాయన్‌ ఎన్‌క్లేవ్‌ తదితర ప్రాజెక్టుల మోసాలపై స్పందించిన రెరా.. కొనుగోలుదారులకు వారు చెల్లించిన సొమ్మును 10.85 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

రెరా జారీ చేసిన ఈ ఆదేశాలను బేఖాతరు చేయడం,నిర్లక్ష్యం ప్రదర్శిస్తే బిల్డర్లు, ప్రమోటర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. రెరా తీసుకున్న ఈ నిర్ణయంతో రియల్ మోసాలకు పాల్పడే సంస్థల్లో వణుకు మొదలైందని, కొనుగోలుదారులకు న్యాయం జరుగుతుందనే భరోసా కలుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement