
పలు పండుగలు, జాతీయ సెలవులు రావడంతో ఈ ఆగస్టు నెలలో దేశం అంతటా బ్యాంకులు 15 రోజుల వరకు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. బ్యాంక్ సెలవుల జాబితా, వాటి ప్రాంతీయ ప్రాముఖ్యత, సెలవుల నేపథ్యంలో వినియోగదారులు తమ లావాదేవీలను ముందుగానే ఎలా ప్లాన్ చేయవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆగస్టులో బ్యాంకు సెలవుల పూర్తి జాబితా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవుదినం, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల మూసివేత అనే మూడు కేటగిరీల కింద బ్యాంకులు సెలవు దినాలను పాటిస్తాయి. 2025 ఆగస్టులో గుర్తించదగిన మూసివేతలు ఇలా ఉంటాయి.
ఆగష్టు 1 బ్యాంకు సెలవు (రాష్ట్రాలను బట్టి మారుతుంది)
ఆగస్టు 3 - ఆదివారం
ఆగస్టు 8 - రక్షా బంధన్ (రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ)
ఆగస్టు 9 - రెండో శనివారం
ఆగస్టు 10 - ఆదివారం
ఆగస్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం / పార్శీ నూతన సంవత్సరం (ముంబై, నాగపూర్)
ఆగస్టు 16 - కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జోనల్ సెలవు
ఆగస్టు 17 - ఆదివారం
ఆగష్టు 23- నాలుగో శనివారం
ఆగస్టు 24 - ఆదివారం
ఆగష్టు 25 జన్మాష్టమి (అనేక రాష్ట్రాలు)
ఆగస్టు 31 - ఆదివారం
తీజ్, హర్తాలికా, ఓనం వంటి స్థానిక పండుగల ఆధారంగా ఇతర ప్రాంతీయ సెలవులు వ్యక్తిగత రాష్ట్రాల్లో వర్తించవచ్చు.
ఆన్లైన్ సేవలు
బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.