breaking news
in august
-
ఆగస్టులో బ్యాంకులు.. వరుస సెలవులు
పలు పండుగలు, జాతీయ సెలవులు రావడంతో ఈ ఆగస్టు నెలలో దేశం అంతటా బ్యాంకులు 15 రోజుల వరకు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. బ్యాంక్ సెలవుల జాబితా, వాటి ప్రాంతీయ ప్రాముఖ్యత, సెలవుల నేపథ్యంలో వినియోగదారులు తమ లావాదేవీలను ముందుగానే ఎలా ప్లాన్ చేయవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.ఆగస్టులో బ్యాంకు సెలవుల పూర్తి జాబితారిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవుదినం, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల మూసివేత అనే మూడు కేటగిరీల కింద బ్యాంకులు సెలవు దినాలను పాటిస్తాయి. 2025 ఆగస్టులో గుర్తించదగిన మూసివేతలు ఇలా ఉంటాయి.ఆగష్టు 1 బ్యాంకు సెలవు (రాష్ట్రాలను బట్టి మారుతుంది)ఆగస్టు 3 - ఆదివారంఆగస్టు 8 - రక్షా బంధన్ (రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ)ఆగస్టు 9 - రెండో శనివారంఆగస్టు 10 - ఆదివారంఆగస్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం / పార్శీ నూతన సంవత్సరం (ముంబై, నాగపూర్)ఆగస్టు 16 - కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జోనల్ సెలవుఆగస్టు 17 - ఆదివారంఆగష్టు 23- నాలుగో శనివారంఆగస్టు 24 - ఆదివారంఆగష్టు 25 జన్మాష్టమి (అనేక రాష్ట్రాలు)ఆగస్టు 31 - ఆదివారంతీజ్, హర్తాలికా, ఓనం వంటి స్థానిక పండుగల ఆధారంగా ఇతర ప్రాంతీయ సెలవులు వ్యక్తిగత రాష్ట్రాల్లో వర్తించవచ్చు.ఆన్లైన్ సేవలుబ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తణుకు : కొద్దిరోజులుగా భానుడి భుగభుగలకు జిల్లాకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆగస్ట్‌లో భారీ వర్షాలు కురవాల్సి ఉండగా ఎన్నడూ లేనట్టుగా వాతావరణం నడి వేసవిని తలపిస్తోంది. రెండు వారాలుగా భానుడు ఉగ్రరూపం దాల్చుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో వారంతా తల్లడిల్లుతున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక జూలై నెలలో వర్షాలు కురిసినప్పటికీ ఆగస్ట్ రెండో వారం నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. సాధారణంగా ఆగస్ట్‌లో వర్షాలు పడతాయని, వాతావరణం చల్లబడుతుందని ఆశించిన ప్రజలకు సూరీడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు ఉదయం నుంచి వీస్తున్న వడగాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోహిణీ కార్తె ముగిశాక జూన్ రెండో వారంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ తర్వాతి రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. గత నెల నెలాఖరు, ఈ నెల మొదటి రెండు రోజుల్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాడ్పులతో పాటు ఉక్కపోత కూడా తోడయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 35 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతల నమోదు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు జిల్లాలో 35 డిగ్రీలపైగా నమోదవుతున్నాయి. ఏలూరులో గురు, శుక్రవారాల్లో 35 డిగ్రీల పైగా నమోదు కాగా ప్రధాన పట్టణాలన్నింటిలో దాదాపు అదే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు నిత్యం రద్దీగా ఉండే రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వేడి ఉంటోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
నెలంతా పండుగే..
రాయవరం : ఆగస్టు.. ఈ నెలంతా పండుగ వాతావరణమే. నాలుగైదు పండుగలతో పాటు శ్రావణమాసం కలుస్తుండడంతో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించినా మేలు జరుగుతుందనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. 7న నాగపంచమితో ప్రారంభం.. ఆదివారం నాగుల పంచమి. నాగపంచమి రోజున సంతానం లేని వాళ్లు, వివాహం కావల్సిన వారు నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. నాగేంద్రుడిని దర్శించుకుంటారు. పాముల పుట్టలు, నాగదేవత ఆలయాల్లో పాలు పోస్తారు. ఇలా చేస్తే నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 9న మంగళగౌరీ వ్రతం.. శ్రావణమాసంలో మహిళలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుతూ ముత్తయిదువలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం, నోము నోయడం జిల్లాలో అనాదిగా వస్తోంది. 12న వరలక్ష్మీ వ్రతం.. శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదిగా హిందువులు భావిస్తుంటారు. రెండో శుక్రవారం మహిళలు ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. వ్రతం ఆచరిస్తే అషై్టశ్వర్యాలు సమకూరడంతో పాటు మాంగళ్య బంధం బలపడుతుందని నమ్ముతారు. 15న స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ రోజు ఆగస్టు 15. సుమారు 200 ఏళ్ల బ్రిటిష్ వారి చీకటి పాలనకు తెరపడిన రోజు. ఈ రోజున జిల్లాలో ఉన్న 52 లక్షల మందికి పండుగే అని చెప్పవచ్చు. 18న రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలా మంది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఎంత దూరంలో ఉన్నా తల్లిదండ్రుల ఇంటికి చేరుతారు. 24న కృష్ణాష్టమి.. కృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగ నిర్వహిస్తుంటారు. చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి, వారి లేత పాదాలకు రంగులు అద్ది, ఇంట్లో బుడి బుడి అడుగులు వేయిస్తుంటారు. వారి పాదముద్రలను చూసి మురిసిపోతుంటారు. కృష్ణాష్టమినాడే ఉట్టి కొడితే పుణ్యం లభిస్తుందని యువకులు ఉట్టి కొట్టడానికి పోటీ పడుతుంటారు. ఉట్టిలోని నైవేద్యాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం.