
డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక నియంత్రణ సంస్థలు అత్యవసర సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) సంయుక్తంగా పెట్టుబడిదారుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.
డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు పెరుగుతున్నందున, రిటైల్ ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడి సాధనాలతోపాటు టెక్నాలజీపై అవగాహన కల్పించడమే లక్ష్యం పెట్టుకున్నాయి. మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్ ఆధారిత కంటెంట్ పెరిగిపోతుండడంతో ఇన్వెస్టర్లు మోసాల బారిన పడుతున్నారు.
గ్యారెంటీడ్ రిటర్న్స్.. ఇన్వెస్టర్ల పెట్టుబడులపై గ్యారెంటీడ్ రిటర్న్స్ అంటూ సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు.
డిజిటల్ హైజీన్: ఇన్వెస్టర్లు సెబీ రిజిస్టర్డ్ యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి. అధికారిక ఛానెళ్లలో మధ్యవర్తులను వెరిఫై చేసుకోవాలి. కాదని ప్రత్యేకంగా నేరగాళ్లు పంపే లింక్‌లపై క్లిక్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.
పెట్టుబడి సలహాలు: ముఖ్యంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు లేదా ఈమెయిల్స్ లోని తెలియని సోర్స్ నుంచి వస్తున్న సమాచారాన్ని నమ్మవద్దు. ఉచిత సలహా వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఎవరికివారు నిత్యం ప్రశ్నించుకోవాలి.
సెబీ రిజిస్టర్డ్ యాప్‌లు: సెబీ రిజిస్టర్డ్ యాప్‌లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. సదరు యాప్ సెబీ అధికారిక జాబితాలో లేకపోతే దాన్ని వెంటనే డిలీట్ చేయాలి. ఫిషింగ్, మోసం స్కీమ్‌ల్లో నకిలీ యాప్‌లే సాధనంగా ఉంటాయి.
మధ్యవర్తులను వెరిఫై చేయడం: బ్రోకర్లు, సలహాదారులు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల చట్టబద్ధతను ధ్రువీకరించుకోవాలి. అందుకు సెబీ అధికారిక పోర్టలో ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే రిపోర్ట్ చేయాలి. ముందస్తు రిపోర్టింగ్ ఇతరులను రక్షించడంలో సహాయపడుతుంది. రెగ్యులేటర్లు వేగంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది.