దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. గురువారం ఉదయం గణనీయంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు నక్కతోక తొక్కినట్లు మరింత ఊరట లభించింది.
హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం రూ.2550 తగ్గి రూ.1,42,750 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.7140 క్షీణించి రూ.1,37,750 లకు దిగివచ్చింది.
అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం ఉదయం రూ.2780 తగ్గి రూ.1,54,640 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.6550 కరిగి రూ. 1,50,280 లకు క్షీణించింది.
ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు సిల్వర్ కేజీకి రూ.10000 క్షీణించి రూ.2,65,000 వద్దకు దిగివచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


