జియో ప్లాన్: ఒక్కసారి రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్లు | Jio amazing plan 2 5GB daily for 365 days free Gemini AI Pro and more | Sakshi
Sakshi News home page

జియో ప్లాన్: ఒక్కసారి రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్లు

Mar 19 2026 9:05 PM | Updated on Mar 19 2026 9:09 PM

Jio amazing plan 2 5GB daily for 365 days free Gemini AI Pro and more

పదే పదే రీఛార్జ్ చేయించుకునే తలనొప్పి లేకుండా, ఒక్కసారి రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రశాంతంగా గడపాలనుకునే వారి కోసం రిలయన్స్ జియోలో ఒక అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 3,599 ధరతో కూడిన ఈ ప్లాన్ కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా, ఏకంగా రూ. 35,000 పైగా విలువైన ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుండటం విశేషం.

జియో రూ. 3,599 ప్లాన్ పూర్తి వివరాలు

ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఇవే.. 365 రోజులు (పూర్తిగా ఒక సంవత్సరం) వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5G డేటా పొందే అవకాశం ఉంటుంది.

సాధారణ బెనిఫిట్స్‌తో పాటు, ఈ ప్లాన్ ద్వారా లభించే ఎక్స్‌ట్రా ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు, లేటెస్ట్ సినిమాలు చూడాలనుకునే వారి కోసం కంపెనీ 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.

అలాగే ఈ ప్లాన్‌లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్‌. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రియుల కోసం భారీ విలువ కలిగిన గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఆఫర్ చేస్తోంది. ఫోన్ మెమరీ సమస్యను అధిగమించేందుకు 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement