
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 308.47 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో.. 80,710.25 వద్ద, నిఫ్టీ 73.20 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో 24,649.55 వద్ద నిలిచాయి.
ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఎక్స్‌టిగ్లోబల్ ఇన్ఫోటెక్, తాన్లా ప్లాట్‌ఫారమ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్, త్రివేణి టర్బైన్, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, శీతల్ కూల్ ప్రొడక్ట్స్, నెట్‌వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).