ఎంసీఎక్స్‌లో సాంకేతిక లోపాలపై సెబీ చీఫ్ పాండే అసహనం
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో పదే పదే సాంకేతిక సమస్యలు వస్తుండటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అసహనం వ్యక్తం చేశారు. తాజా సమస్యను అధ్యయనం చేసిన మీదట అవసరమైతే సెబీ స్వయంగా తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాల్లో సెబీ ప్రామాణికమైన ప్రోటోకాల్స్‌ను పాటిస్తుందని పాండే పేర్కొన్నారు.
‘జూలైలో ఒకసారి సమస్య వచ్చింది. ఇదిగో ఇప్పుడు మరొకటి. ఇలా మాటిమాటికీ సమస్యలు వస్తుండటం సరికాదు’ అని ఆయన చెప్పారు. డిజిటలీకరణ వేగవంతం అవుతున్న నేపథ్యంలో వ్యాపారాలకు అంతరాయాలు తలెత్తకుండా మార్కెట్ ఇంటర్మీడియరీలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, క్లయింట్ల డేటా..కీలకమైన మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లకుండా సైబర్ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పాండే పేర్కొన్నారు. గత నెల ఎంసీఎక్స్‌లో పెద్ద స్థాయిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ట్రేడింగ్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: గోపీచంద్ హిందూజా కన్నుమూత


