సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే
న్యూఢిల్లీ: డిజిటల్ బంగారం లేదా ఈ–బంగారం వంటి ఉత్పత్తులను నియంత్రించాలనుకోవడం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఇవి తమ పరిధిలోకి రావన్నారు. రీట్, ఇని్వట్–2025 జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచి్చన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మ్యూచువల్ ఫండ్స్ అందించే గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) లేదా ట్రేడింగ్‌కు వీలయ్యే ఇతర బంగారం సెక్యూరిటీలనే సెబీ నియంత్రిస్తున్నట్టు చెప్పారు.
నియంత్రణల పరిధిలో లేని డిజిటల్ గోల్డ్ లేదా ఈ–గోల్డ్‌లో లావాదేవీలతో రిస్క్ ఉందంటూ.. వీటికి దూరంగా ఉండాలంటూ ఇటీవలే సెబీ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ‘‘ఆ తరహా డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రించే బంగారం ఉత్పత్తులకు భిన్నమైనవి. వాటిని సెక్యూరిటీలుగా లేదా కమోడిటీ డెరివేటివ్‌లుగా నోటిఫై చేయలేదు. అవి పూర్తిగా సెబీ నియంత్రణల వెలుపల పనిచేస్తున్నాయి.
అటువంటి డిజిటల్ బంగారం సాధనాలతో ఇన్వెస్టర్లు గణనీయమైన రిస్‌్కను ఎదుర్కోవాల్సి రావచ్చు’’అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయమంటూ కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు డిజిటల్ గోల్డ్‌పై ప్రచారం చేస్తున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ హెచ్చరిక జారీ చేసింది. దీంతో డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేసే ప్లాట్‌ఫామ్‌లు తమను సైతం సెబీ నియంత్రణల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశాయి.


