బిట్‌ కాయిన్‌ దారుణ పతనం.. ఎందుకు? | Bitcoin fall below usd 100000 for the first time since June Why | Sakshi
Sakshi News home page

బిట్‌ కాయిన్‌ దారుణ పతనం.. ఎందుకు?

Nov 5 2025 3:59 PM | Updated on Nov 5 2025 4:11 PM

Bitcoin fall below usd 100000 for the first time since June Why

ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ (Bitcoin) విలువ దారుణంగా పతనమైంది. గత కొన్ని నెలలుగా దూసుకెళ్లిన క్రిప్టో ఒక్కసారిగా క్రాష్అయింది. మంగళవారం (నవంబర్‌ 4) లక్ష డాలర్ల మార్కు దిగువకు పడిపోయింది. క్రిప్టో మార్కెట్ విస్తృత క్షీణత కారణంగా 7.4 శాతం పడిపోయి ఐదు నెలల కనిష్ట స్థాయి 96,794 (రూ.85.83 లక్షలు) డాలర్ల వద్దకు వచ్చింది.

ఇటీవల జోరుమీదున్న బిట్కాయిన్సరిగ్గా నెల క్రితం అక్టోబర్ 6న రికార్డు స్థాయిలో 126,000 డాలర్లను తాకింది. అక్కడి నుంచి తాజాగా 20% కంటే పైగా పతనమైంది. గత జూన్ తర్వాత బిట్కాయిన్లక్ష డాలర్ల మార్కు దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి.

క్రిప్టో క్రాష్‌..

బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈక్విటీలలో బేర్ మార్కెట్ నేపథ్యంలో క్రిప్టో మార్కెట్కూడా పతనం దిశలో పయనిస్తోంది. బిట్కాయిన్మాత్రమే కాకుండా పెద్దగా ట్రేడ్కాని ఇతర క్రిప్టో కాయిన్లు ఇలాంటి క్షీణతలనే నమోదు చేశాయి. 50% పైగా నష్టాలను తెచ్చాయి. ఈథర్ మంగళవారం 15% వరకు పడిపోయింది.

కాయిన్మార్కెట్క్యాప్‌ (CoinMarketCap) డేటా ప్రకారం.. గత నెలలో ప్రపంచ క్రిప్టో మార్కెట్ మొత్తం మార్కెట్ విలువలో సుమారు 840 బిలియన్డాలర్లను కోల్పోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ యుద్ధం కొత్త మలుపు తీసుకోవడంతో అక్టోబర్లో బిట్ కాయిన్ చెత్త పనితీరును నమోదు చేసింది.

బిట్‌కాయిన్‌ పతనానికి కారణాలు

బిట్‌కాయిన్‌ తాజా పతనానికి అనేక ఆర్థిక, రాజకీయ, మార్కెట్ సంబంధిత అంశాలు కారణమయ్యాయి.

  • అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండటతో ఇన్వెస్టర్లు క్రిప్టో వంటి రిస్కీ అసెట్లపై పెట్టుబడులను తగ్గించి సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గు చూపుతున్నారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం అంటే డాలర్‌ బలంగా ఉండడం. దాంతో బిట్‌కాయిన్‌ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులకు ఆకర్షణ తగ్గుతుంది.

  • అక్టోబర్‌ నెలలో క్రిప్టో మార్కెట్‌లో బిలియన్ల డాలర్ల బుల్లిష్‌ పొజిషన్లు లిక్విడేట్‌ అయ్యాయి. ఈ ఒత్తిడి అమ్మకాల కారణంగా ధర మరింత వేగంగా పడిపోయింది.

  • బ్లూమ్‌బెర్గ్‌ ప్రకారం, స్టాక్‌ మార్కెట్‌లలో బేర్‌ ట్రెండ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో క్రిప్టో మార్కెట్‌ కూడా అదే దిశలో కదిలింది. ఇన్వెస్టర్లు “రిస్క్ఆఫ్మూడ్‌లో ఉండటంతో బిట్‌కాయిన్‌ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సుంకాల యుద్ధానికి కొత్త మలుపు ఇవ్వడంతో మార్కెట్‌ అనిశ్చితి పెరిగింది. ట్రేడింగ్‌ వాల్యూమ్‌ తగ్గిపోవడం, మదుపరులు వేచి చూడే ధోరణి అవలంబించడం బిట్‌కాయిన్‌ విలువను దెబ్బతీసింది.

  • ఇటీవల క్రిప్టో ఆధారిత ఎక్స్ఛేంజ్‌-ట్రేడెడ్‌ ఫండ్‌ల (ETFs) నుండి నిధులు వెనక్కు మళ్లాయి. భారీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ ఫండ్‌ల ద్వారా క్రిప్టోలోకి పెట్టుబడులు తగ్గించడం, మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరచింది.

  • కొన్ని డిజిటల్‌ అసెట్ట్రెజరీ సంస్థలు తమ బిట్‌కాయిన్‌ నిల్వలను అమ్మే అవకాశం ఉందని ఊహించడంతో మార్కెట్‌లో భయం పెరిగింది. దీని ఫలితంగా ధర మరింత ఒత్తిడికి గురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement