దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలి వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే జెట్ ప్రమాదానికి గురవుతుందని ముందుగానే ఫైలట్ గ్రహించాడని అతను జెట్ నుంచి కిందకి దూకుదామని ప్రయత్నించాడని దర్యాప్తు బృందాలు తెలిపాయి. కానీ ఫైలట్ ఎందుకు జెట్ నుంచి దూకలేకపోయాడో అనే సంగతి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
రెండు రోజుల క్రితం దుబాయ్‌లో జరిగిన ఎయిర్ షోలో తేజస్ జెట్ కూలి వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ మృతిచెందారు. అయితే ఆ ప్రమాద సమయంలో ఫైలట్ జెట్ నుంచి దూకి తప్పించుకొనే ప్రయత్నం చేశాడని దర్యాప్తు బృందాలు తెలిపాయి. కానీ ఆయన అలా చేయకపోవడానికి జెట్‌లో ఏదైనా సాంకేతిక కారణాలు తలెత్తి ఉండవచ్చని లేదా ఫైలట్ ఆరోగ్య పరిస్థితులైనా సహకరించకపోయి ఉండచ్చని దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి.
ఆ వివరాలు జెట్‌కు సంబంధించిన బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే తెలుస్తాయని ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారులు తెలిపారు. కాగా ఎయిర్ షో ప్రారంభానికి ముందు వింగ్ కమాండర్ సయీల్ కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సేత్, యూఏఈ భారత రాయభారి దీపక్ మిట్టల్ తో మాట్లాడుతున్న వీడియో వైరలవుతోంది. అందులో నిమాన్ష్ సరదాగా నవ్వుతూ అధికారులతో మాట్లాడుతున్నారు.
Life is so unpredictable !
Wing Commander Namansh Syal smiling moments before taking to the skies at the Dubai Air Show.
Travel Well Brother..May your final flight be peaceful ✈️ ❤️ Salute 🇮🇳🙏 pic.twitter.com/7OXt8J5FnI— Major Surendra Poonia (@MajorPoonia) November 22, 2025
వింగ్ కమండర్ నమాన్ష్ సయీల్ అంత్యక్రియలు నేడు హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వంత గ్రామం పాటియాల్కర్ లో జరిగాయి. తన కుటుంబ సభ్యులతో పాటు ఎయిర్‌ఫోర్స్ అధికారులు, స్థానికులు పెద్దఎత్తున హాజరై నమాన్ష్‌కు ఘన నివాళులు అర్పించారు.


