దుబాయ్‌లో శుక్రవారం నాటి ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ నమాంశ్ సియాల్(37) దుర్మరణం చెందాడు. యుద్ధ విమానం అదుపు తప్పి క్రాష్ కావడంతో పైలట్ మృత్యువాత పడ్డారు ఇంతటి విషాదం చోటు చేసుకున్న సదరు ఎయిర్ షో కొనసాగించడంపై యూఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్ మేజర్ టేలర్ ఫెమీ హీస్టర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
ఇంతటి దారుణం చేసుకున్నా షోను ఎలా కొనసాగిస్తారంటూ ప్రశ్నించాడు. ఇదేనా సాటి పైలట్ ఇచ్చే గౌరవం అంటూ షో నిర్వహకులపై మండిపడ్డారు. అదే సమయంలో తాను ఈ షోలో పాల్గొననంటూ వైదొలిగారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు హీస్టర్. ‘ మా తుది ప్రదర్శనను ఇవ్వడానికి మా టీమ్ సిద్ధంగా లేదు. ఈ షో నుంచి మేము వైదులుగుతున్నాం. అందుకు కారణం.. తేజస్ యుద్ధ విమానం కూలిపోయి భారత పైలట్ దుర్మరణం చెందితే షోను కొనసాగించాలనుకోవడం మంచి పరిణామం కాదు. ఇదేనా మనం తోటి పైలట్‌కు, వారి కటుంబానికి ఇచ్చే గౌరవం?’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగినప్పటికీ ఎగిరే ప్రదర్శనలు కొనసాగుతాయని సమాచారం అందిన తర్వాత ఏం జరిగిందనేది హీస్టర్ వివరించాడు. ప్రమాదం జరిగిన గంట, రెండు గంటల మధ్యలో అక్కడకి వెళ్లాను,. అది ఖాళీగా ఉంది. షో ఆపివేయబడుతుందని అనుకున్నాను. అలా జరగలేదు. మళ్లీ యథావిధిగా షో నిర్వహించారు. అందుకే మా టీమ్ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది’ యూఎస్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ తెలిపారు.
ఆరోజు జరిగిన ప్రమాదం తేజస్ యుద్ధ విమానం కంట్రోల్ తప్పి నేలపై పడటంతో మంటలు చుట్టుముట్టాయి. ఆ ఘటనలో తేజస్ పైలట్ మాంశ్ సియాల్ ప్రాణాలు కోల్పోయాడు.


