దుబాయ్‌కి దూసుకుపోతున్న దేశీ పెట్టుబడులు
ఫ్లెక్స్ ఆఫీసుల నుంచి ఫండ్ హౌస్‌ల వరకు
ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థల ఎంట్రీ
అంతర్జాతీయంగా కార్యకలా పాలు విస్తరించే ప్రణాళికల్లో ఉన్న దేశీ సంస్థలకు దుబాయ్ ఇప్పుడు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. ఇన్వెస్టర్లకు అనుకూల విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లెక్స్ ఆఫీస్ సరీ్వసులందించే సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఫండ్ హౌస్‌లు, ఫ్యామిలీ ఆఫీసులు మొదలైనవి దుబాయ్ బాట పడుతున్నాయి.
ఇటీవలే ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సంస్థ కార్పొరేట్‌ఎడ్జ్ 31,000 చ.అ. ఆఫీస్ స్పేస్‌ని లీజుకి తీసుకుంది. అటు నిసస్ ఫైనాన్స్ సరీ్వసెస్ కంపెనీ (నిఫ్కో) అనే లిస్టెడ్ ఆల్టర్నేటివ్ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అత్యధికంగా రూ. 536 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దుబాయ్ మోటర్ సిటీలోని లుటా ఎవెన్యూ అనే రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఇన్వెస్ట్ చేసింది.
ఇప్పటికే శోభా, సన్‌టెక్ లాంటి దిగ్గజ రియల్టర్లు అక్కడ చేపట్టిన ప్రాజెక్టులకు ఇవి అదనం. 2024లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇవి సుమారు 35 బిలియన్ దిర్హామ్‌ల మేర పెట్టుబడులు పెట్టాయి. జెబెల్ అలీ ఫ్రీ జోన్‌లో సుమారు 2,300 భారతీయ కంపెనీలకు కార్యకలాపాలు ఉన్నాయి. 2024–25 లో ఇరు దేశాల మధ్య జరిగిన 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంలో వీటి వాటా 6.9 బిలియన్ డాలర్లకు పైగా నమోదైంది.
గ్లోబల్ హబ్..
ప్రపంచం నలుమూలలి్నంచి కంపెనీలు తమ ప్రాంతీయ, అంతర్జాతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు దుబాయ్‌ని ఎంచుకుంటున్నాయి. దీంతో అది అత్యంత వేగంగా గ్లోబల్ బిజినెస్ హబ్‌గా ఎదుగుతోంది. భారతీయ ఉద్యోగుల దన్నుతో అంతర్జాతీయంగా కార్యకలాపాలను విస్తరించాలనుకునే దేశీ సంస్థలకు దుబాయ్ ఆకర్షణీయంగా ఉంటోందని పరిశ్రమవర్గాలు వివరించాయి.
ఇన్వెస్టర్లకు అనుకూలమైన విధానాలు, పన్నులపరంగా ప్రయోజనకరంగా ఉండే నిబంధనలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలు దుబాయ్‌కి సానుకూలంగా ఉంటున్నాయి. భారత్‌లో ఖరీదైన మార్కెట్లకు దుబాయ్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని రియల్టీ రంగ నిపుణులు తెలిపారు. దేశీయంగా విలాసవంతమైన ప్రాపరీ్టల విలువ గత అయిదేళ్లలో దాదాపు 60 శాతం పైగా పెరిగాయని, ముంబైలాంటి నగరాల్లో బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్టుల్లో ప్రాపరీ్టల ప్రారంభ ధరే రూ. 5 కోట్లుగా ఉంటోందని వివరించారు.
ఇక ప్రధాన ప్రాంతాల్లో చూస్తే రూ. 50 కోట్లు కూడా దాటేస్తోందని పేర్కొన్నారు. అదే దుబాయ్‌లో సగటు ప్రాపర్టీ లావాదేవీ విలువ రూ. 5 కోట్లుగా ఉంటోంది. అందుబాటు ధరలో లభించడంతో పాటు ఆదాయ పన్ను లేకపోవడం, 2 మిలియన్ దిర్హామ్‌ల పెట్టుబడులు పెడితే పదేళ్ల పాటు గోల్డెన్ వీసాలాంటి ప్రయోజనాలు దుబాయ్‌కి సానుకూలంగా ఉంటున్నాయి. లగ్జరీతో పాటు కమ్యూనిటీ లివింగ్‌ని కోరుకునే భారతీయ కొనుగోలుదారులు ప్రధానంగా దుబాయ్ మెరీనా, డౌన్‌టౌన్ దుబాయ్, ది పా మ్ జుమేరాలాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారు.
సాక్షి, బిజినెస్ డెస్క్


