సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం దుమారం కొనసాగుతుంది. న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, డెరెక్ ఓ’బ్రయన్ సహా పలువురు నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో పోలీసులు వారిని బలవంతంగా లాగి అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీకి ఐపాక్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది. ఈనేపథ్యంలో ఈడీ అధికారులు ఐపాక్ కార్యాలయంపై దాడులు జరిపారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే,ఈడీ దాడుల్ని టీఎంసీ ఎంపీలు ఖండిస్తున్నారు. ఎన్నికల ముందు ఈడీ దాడులు ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ప్రయత్నం. తమ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని కేంద్రం చూస్తోంది’అని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అందుకు బీజేపీ సైతం టీఎంసీ దాడుల్ని తిప్పికొడుతోంది. ఈడీ దాడులు చట్టుపరమైనవని, ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులు చట్టపరమైనవని, అవినీతి కేసులపై విచారణలో భాగమని స్పష్టం చేసింది.
VIDEO | Delhi: TMC MPs protest outside Union Home Minister Amit Shah’s office with placards reading “Bengal rejects Modi-Shah’s dirty politics,” following the ED raids at I-PAC’s office in Kolkata yesterday.#TMC #AmitShah #Kolkata
(Source - Third party)
(Full VIDEO available… pic.twitter.com/7VyF2e7dfL— Press Trust of India (@PTI_News) January 9, 2026


