ఒక్క బిట్‌ కాయిన్‌.. రూ.కోటి నాలుగు లక్షలు | Bitcoin Hits Record High of USD 120000 may rise more says Giottus CEO | Sakshi
Sakshi News home page

ఒక్క బిట్‌ కాయిన్‌.. రూ.కోటి నాలుగు లక్షలు

Jul 14 2025 12:47 PM | Updated on Jul 14 2025 1:40 PM

Bitcoin Hits Record High of USD 120000 may rise more says Giottus CEO

120,000 డాలర్లకు చేరుకున్న బిట్‌కాయిన్ విలువ

బిట్‌కాయిన్ ధర లక్షా 35వేల డాలర్లకు చేరవచ్చు

జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్

పర్సనల్ ఫైనాన్సింగ్ కేటగిరీలో బిట్‌కాయిన్ సరికొత్త పెట్టుబడి ఎంపికగా మారిపోయింది. దీంతో క్రిప్టో కాయిన్ రేటు తన సుదీర్ఘ ప్రయాణంలో 1లక్ష 20వేల డాలర్ల జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది. అయితే ఇన్వెస్టర్లలో వచ్చిన అవగాహన, క్రిప్టోల వైపు వారి అడుగులు పెద్ద మార్పుగా పరిగణిస్తున్నట్లు ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ జియోటస్ సంస్థ పేర్కొంది.

ఒకప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం క్రిప్టోల్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం దానిని ఒక వ్యూహాత్మక దీర్ఘకాలిక అసెట్ క్లాస్ కింద పరిగణిస్తున్నట్లు వాలెట్ చేరికల్లో పెరుగుదల సూచిస్తోందని క్రిప్టో ఎక్స్ఛేంజీ వెల్లడించింది. ప్రస్తుతం వచ్చిన మార్పులు బిట్‌కాయిన్ వేగంగా సంపద సృష్టికి పునాది స్తంభంగా మారుతుందనే లోతైన మార్కెట్ నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఇటీవల బిట్‌కాయిన్ తన టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్ లక్ష 10వేల డాలర్ల మార్కును అధిగమించటం మరింత ర్యాలీకి కారణంగా మారింది.

దీనికి తోడు ఎథెరియం, సోలానా, కార్డానో, సుయి వంటి ఇతర కాయిన్స్ కూడా క్రిప్టో ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి. డేటా ప్రకారం ఈ ఏడాది బలమైన ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని ఊహించబడింది. ఈ క్రమంలో చిన్నచిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ క్రిప్టోల ప్రాభల్యం పెట్టుబడుల ప్రపంచంలో సుస్థిరంగా ముందుకు సాగుతుందని జియోటస్ భావిస్తోంది.

ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే అనుమానం బిట్‌కాయిన్ ర్యాలీ ఇంకెంత వరకు చేరుకుంటుంది అన్నదే. దీనికి జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అంచనాలను చూస్తే ఇకపై బిట్‌కాయిన్ ధర లక్షా 35వేల డాలర్ల రేటు వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో క్రిప్టో ఈటీఎఫ్ పెట్టుబడులు పెరిగితే ఒక్కో బిట్‌కాయిన్ రేటు ఏకంగా లక్షా 50వేల డాలర్ల వరకు చేరుకునే అవకాశం ఉందని విక్రమ్ చెబుతున్నారు. మార్కెట్లలో ఓలటాలిటీ, ఫ్రాఫిట్ బుక్కింగ్, ఇతర ఒడిదొడుకులు ఉన్నప్పటికీ చాలా మంది తమ పోర్ట్ ఫోలియోలో క్రిప్టోలకు కొంత సముచిన మెుత్తాన్ని కేటాయించి ముందుకు సాగటానికి ఇది సరైన సమయంగా జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement