
డబ్బు లేదని బాధపడడం కంటే దాన్ని ఎలా వశం చేసుకోవాలనే దాని గురించి ఆలోచించేవారి సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆర్థిక పరిమితులు ఇంతేనని.. తమ జీవితాలు ఏం చేసినా బాగోవు..అనే ధోరణికి వచ్చేస్తున్నారు. ఇందుకు బదులుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యతరగతివారు ఆర్థిక అంశాలపట్ల తమ నమ్మకాలను పరిమితంగా ఉంచుకుంటారని ఇన్వెస్టర్, పోర్ట్ఫోలియో స్ట్రాటజిస్ట్ శ్యామ్ శేఖర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ మనస్తత్వం నుంచి ఎలా బయటపడాలో కనీసం ఆలోచించేందుకు సైతం వారు నిరాకరిస్తున్నారని చెప్పారు.
శ్యామ్ శేఖర్ ఎక్స్‌లో తెలిపిన వివరాల ప్రకారం..‘మధ్యతరగతి కుటుంబాలు తమ మనస్తత్వం మర్చుకోవు. అందుకే ఆర్థికంగా ఎదగలేవు. కనీసం ఆ దిశగా ఆలోచించడానికిసైతం నిరాకరిస్తారు. ఇంట్లో ఎయిర్ కండీషనర్, కారు ఉండాలని కలలు కనే మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అవసరాలు నిజంగా తమ సామర్థ్యాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉన్న పరిధిలో ఆర్థికంగా పుంజుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఈ అవసరాలే వారికి పెద్ద లక్ష్యాలుగా తోస్తాయి’ అన్నారు.
Why do middle class families stay middle class? It is because they refuse to think of what will make them break out of the middle class mindset.
What is the middle class mindset?
It is something which stops you from dreaming of what you feel is beyond your present reach.
You…— Shyam Sekhar (@shyamsek) July 4, 2025
ఇదీ చదవండి: ఉద్యోగుల్లో వేతన సంక్షోభం
‘డబ్బు సంపాదనను కాంపౌండింగ్ దృష్టితో చూడాలి. దీర్ఘకాలంలో భారీ సంపద చేకూర్చే మార్గాలను కనుగొనాలి. ఇలాంటి ఆలోచనలతో మీరు జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. రూ.కోటి చేరువలో ఉన్న వ్యక్తి రూ.20 కోట్లకు సులువుగా చేరుకోవచ్చు. కాంపౌండింగ్‌తో ఇది సాధ్యమే. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సంపదను సృష్టిస్తే తరాలు అది కొనసాగుతోంది. పర్సనల్ ఫైనాన్స్‌పై పరిమిత ఆలోచనల నుంచి బయటకురావాలి’ అన్నారు.