
దేశీయంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నాటకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చికిత్స ఖర్చులు, తీవ్రమైన వ్యాధులు, ప్రివెంటివ్ కేర్‌పై వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుండటం తదితర అంశాల వల్ల సంప్రదాయ ఆరోగ్య బీమా పాలసీల తీరుతెన్నులు మారిపోయాయి. అందరికీ ఒకే రకం పాలసీలనేవి ఇప్పటి పరిస్థితులకు అనువైన విధానంగా ఉండటం లేదు. నేటి కస్టమర్లు తమ వాస్తవిక అవసరాలు, వ్యక్తిగత వైద్య చరిత్ర, మారే జీవన దశలకు అనుగుణంగా, సమయోచితంగా, సరళంగా ఉండే పాలసీలను కోరుకుంటున్నారు. 30లలో ఉన్న ఒంటరి వర్కింగ్ ఉమన్ కావచ్చు లేదా మధుమేహం ఉన్న సీనియర్ సిటిజన్ కావచ్చు లేదా పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటున్న యువ జంట కావచ్చు ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. ఒకే రకమైన పాలసీ వల్ల వారి అవసరాలు తీరవు. ఇలా వినియోగదారుల మైండ్‌సెట్ మార డం వల్ల, తమకు అనువైన విధంగా మార్చుకోగలిగే మాడ్యులర్ లేదా కస్టమైజబుల్ హెల్త్ ప్లాన్లకు ఆదరణ పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఇది స్మార్ట్ విధానంగా ఉంటోంది.
ఈ హెల్త్ ప్లాన్లలో ప్రత్యేకతలు..
కస్టమైజబుల్ లేదా మాడ్యులర్ హెల్త్ ప్లాన్లనేవి నిర్దిష్టమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గ కవరేజీని తీసుకునేలా పాలసీదారులకు వెసులుబాటు కల్పిస్తాయి. చాలా మటుకు పథకాల్లో, బేస్ హాస్పిటలైజేషన్ కవరేజీ ఉంటుంది. వ్యక్తిగత అవసరాలను బట్టి మరిన్ని ఫీచర్లను జోడించుకునేందుకు ఇవి యూజర్లకు వీలు కలి్పస్తాయి. ఉదాహరణకు, ప్రీ–సెట్ రూమ్ కేటగిరీకే పరిమితమైపోకుండా, పాలసీదారులు షేర్డ్ రూమ్‌ల నుంచి మొదలుపెట్టి ఎలాంటి పరిమితులు లేని లేదా సూట్ స్థాయి గదుల వరకు వేర్వేరు రూమ్ రెంట్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్ రిస్టోరేషన్ అనేది మరో ప్రధాన ఫీచరు. ఒకవేళ పాలసీదారుకు, సంవత్సరం మధ్యలో కవరేజీ అయిపోతే, చాలా మటుకు ప్లాన్లు ఆటోమేటిక్‌గా బీమా మొత్తాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తాయి. ఇలా ఏడాదిలో ఒకసారికి మించి పునరుద్ధరిస్తాయి. కాలక్రమేణా, సంవత్సరాల తరబడి ఎలాంటి క్లెయిమూ చేయకపోతే పర్మనెంట్ నో–క్లెయిమ్ బోనస్ ప్రయోజనం దక్కుతుంది. అదనపు పేపర్‌వర్క్ లేదా గణనీయంగా ప్రీమియంల పెరిగే ప్రసక్తి లేకుండానే సమ్ ఇన్సూర్డ్ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ ప్లాన్లు పలు యాడ్–ఆన్లను అందిస్తాయి. మెటర్నిటీ, కవరేజీ, క్రిటికల్ ఇల్‌నెస్ సంరక్షణ, అంబులెన్స్ సర్వీసులు, హోమ్ కేర్, ఆయుష్ చికిత్సలు, దంత సంరక్షణలాంటి అనేక ప్రయోజనాలను కల్పిస్తాయి. జీవిత దశలను బట్టి రైడర్లను తీసుకునే మాడ్యులర్ ప్లాన్లు ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. యువ ప్రొఫెషనల్స్, అవసరమైతే ప్రీమియంను తగ్గించుకునేందుకు, మెటర్నిటీ ప్రయోజనాలను వదులుకుని, అధిక డిడక్టబుల్‌ని ఎంచుకోవచ్చు. పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటున్న జంట మొదటి రోజు నుంచి మెటర్నిటీ, నవజాత శిశువు, ఓపీడీ కేర్‌ను ఎంచుకోవచ్చు. ఇలాంటి అనేకానేక అవకాశాలు ఉండటమనేది పాలసీదారులు తమ బడ్జెట్‌కు తగ్గట్లుగా ప్లాన్ చేసుకునేందుకు వీలవుతుంది. అలాగే, తమకు ప్రస్తుతం అవసరమైనది మాత్రమే తీసుకుని, తర్వాత పరిస్థితులు మారే కొద్దీ కవరేజీని పెంచుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
20ల ఆఖర్లోను, 40ల మధ్యలోను ఉన్న వారికి, అంటే తమ కెరియర్లలో ప్రారంభ, మధ్య దశల్లో ఉన్నవారికి ఇలాంటి ప్లాన్లు ప్రయోజనకరంగా ఉంటాయి. తమ జీవన విధానం, ఫ్యామిలీ ప్లానింగ్, దీర్ఘకాలిక ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా పథకాన్ని మార్చుకోగలిగే వెసులుబాటుతో తక్కువ ప్రీమియంలను లాక్ ఇన్ చేసుకునే అవకాశం పొందవచ్చు. యువ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ యాడ్–ఆన్‌లు, అధిక డిడక్టబుల్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే జంటలు లేదా యువ కుటుంబాలు మెటరి్నటీకి, నవజాత శిశువు సంరక్షణ, వెల్‌నెస్ ఫీచ ర్లకు ప్రాధాన్యమివ్వొచ్చు. 50లకు చేరువవుతు న్న వారూ బేస్ పాలసీని సమూలంగా మార్చే సుకోకుండా, క్రిటికల్ ఇల్‌నెస్ లేదా తీవ్రమైన అనారోగ్యాల నియంత్రణకు సంబంధించిన నిర్దిష్ట కవరేజీలను తీసుకోవడం ద్వారా మాడ్యులర్ ప్లాన్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు.
క్లెయిమ్‌లపై ప్రభావం
అయితే, కస్టమైజ్ చేసుకునేటప్పుడు అన్ని వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కొన్ని కవరేజీలను వదిలివేయడం లేదా తక్కువ లిమిట్స్‌ను ఎంచుకోవడం (ఉదాహరణకు రూమ్ రెంట్‌కి పరిమితులు) లేదా క్రిటికల్ ఇల్‌నెస్‌ను ఎంచుకోకపోవడం లాంటి అంశాల వల్ల, వైద్యపరంగా తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తగినంత కవరేజీ లేకుండా పోయే అవకాశం ఉంది. కో–పే పర్సంటేజీలు, ఉప–పరిమితులు, వెయిటింగ్ పీరియడ్లు, మినహాయింపులు మొదలైన ముఖ్యమైన వివరాలన్నీ పాలసీ డాక్యుమెంట్లలో ఉంటాయి. ఇవన్నీ కూడా క్లెయిమ్‌లపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
ఇదీ చదవండి: రిటైర్మెంట్ కోసం స్మాల్‌క్యాప్ బెటరా?
క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ లేదా ఆమోదించడానికి పట్టే సమయంపై కొన్ని యాడ్–ఆన్‌లు ప్రభావం చూపవచ్చు. కాబట్టి, పర్సనలైజ్ చేసుకునే సౌకర్యం ఉన్నప్పటికీ, పాలసీని కేవలం అఫోర్డబిలిటీ కోణంలోనే చూడకుండా అత్యవసర పరిస్థితుల్లో అర్ధవంతమైన విధంగా భద్రత లభించేలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవడం కూడా చాలా ముఖ్యం. కస్టమైజ్ చేసుకోదగిన ప్లాన్లనేవి ప్యాసివ్ ఇన్సూరెన్స్ విధానానికి భిన్నంగా ఆరోగ్య సంరక్షణ కోసం క్రియాశీలకంగా ప్లానింగ్ చేసుకునేందుకు తోడ్పడతాయి. మరింత నియంత్రణను, మరింత విలువను, అలాగే మీ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటును అందిస్తాయి. ఆరోగ్యపరమైన రిసు్కలు అనూహ్యమైన విధంగా ఉంటున్న నేపథ్యంలో మాడ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లనేవి, ఆర్థిక సంక్షేమానికి సుస్థిర విధానంగా ఉపయోగపడగలవు.