
భారతదేశంలో ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తమ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హెల్త్ ఆల్ఫా (Health Alpha) పేరుతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఆధునిక వైద్య ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అన్ని వయసుల వారికి మెరుగైన రక్షణ కల్పించడానికి రూపొందిస్తున్నట్లు చెబుతున్న ఈ ప్లాన్ వివిధ రకాల ప్రత్యేకతలు, సౌకర్యాలు, ప్రయోజనాలు కలిగి ఉందని కంపెనీ తెలిపింది.
అనూహ్యంగా పెరిగే వైద్య ఖర్చుల నుంచి పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఎస్‌బీఐ జనరల్ (SBI General) ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. జీఎస్టీ సంస్కరణల తర్వాత ఎస్‌బీఐ ప్రారంభించిన మొదటి ఆరోగ్య బీమా ఇది.
అదనంగా ప్రీమియం చెల్లించకుండా 10 రెట్లు క్లెయిం-ఫ్రీ క్యుమిలేటివ్ బోనస్‌ను అందిస్తున్నట్లు చెప్పింది. ఈ ప్లాన్‌లో బేస్ కవరేజీపై గరిష్ట పరిమితి లేదని తెలిపింది. ‘జిమ్, స్పోర్ట్స్ ఇంజ్యూరీ కవరేజి కూడా లభిస్తుంది. అందుకు ఓపీడీ ప్రయోజనాలు, పరీక్షలు, చికిత్స, మందుల ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ప్లాన్ కొనుగోలు చేసేందుకు కోట్ చేసిన 5 రోజుల్లోగా కొనుగోలు చేసినట్లయితే ప్రీమియంపై 5% తగ్గింపు పొందవచ్చు’ అని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: చనిపోయేంత కాలం బ్యాంకు నుంచి డబ్బు వచ్చేలా..