నెలకు రూ.10,000 జీతం.. సెకండ్ హ్యాండ్ ఫోన్ | Akshat Shrivastava financial advice youth finance | Sakshi
Sakshi News home page

నెలకు రూ.10,000 జీతం.. సెకండ్ హ్యాండ్ ఫోన్

Jun 19 2025 2:51 PM | Updated on Jun 19 2025 3:21 PM

Akshat Shrivastava financial advice youth finance

ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ డబ్బు పొదుపునకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం తన వార్షిక ఆదాయంలో 95% ఆదా చేస్తున్నట్లు చెప్పారు. తన ఆర్థిక క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అక్షత్ ఎక్స్‌లోని వివరాల ప్రకారం.. తాను నెలకు కేవలం రూ.10,000 సంపాదనతో కెరియర్‌ ప్రారంభించారు. తల్లిదండ్రులతో కలిసి ఉంటూ సెకండ్ హ్యాండ్ ఫోన్ వాడుతూ, బయట నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకోకుండా ఇంట్లో తయారు చేసిన భోజనం తింటూ నెలకు రూ.1,000-2,000 పొదుపు చేయగలిగాడు. అప్పులు చేయలేదు.. అనవసరమైన ఖర్చులు లేవు. మొదటి నుంచి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చిన్నమొత్తంలో స్థిరంగా పొదుపు చేస్తూ వచ్చారు.

కొన్నేళ్ల తర్వాత రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరారు. తర్వాత అతని పొదుపు అలవాట్లు కూడా పెరిగాయి. ఏడాదికి కనీసం రూ.20 లక్షలు పొదుపు చేస్తూ అప్పులేని జీవనం కొనసాగించారు. అందులో ఎక్కువ భాగాన్ని అధిక వృద్ధి పెట్టుబడులకు మళ్లించారు. కాలక్రమేణా ఆ పెట్టుబడులు సొంత ఆదాయాన్ని సృష్టించడం ప్రారంభించాయి. దాంతో రిటైర్మెంట్‌ కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగులు వేశారు.

ఇదీ చదవండి: ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్‌..

ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు, ప్రపంచ ప్రయాణాలు చేస్తూ ఖరీదైన నగరంలో నివసిస్తున్నప్పటికీ అక్షత్ తన పొదుపు రేటు ఇప్పటికీ 95% కొనసాగిస్తున్నారు. జీవనశైలి మారుతున్నా పొదుపు మాత్రం మరవకూడదని చెబుతున్నారు. ఏళ్ల తరబడి తనకు మార్గనిర్దేశం చేసిన నియమాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘మీరు ఏదైనా రెండుసార్లు కొనగలిగితే తప్పా దాన్ని ఒకసారి కొనవద్దు. మీ నైపుణ్యాలు మెరుగుపడే పనికి మాత్రం ఖర్చు చేసేందుకు వెనుకాడవద్దు’ ఇది తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement