ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్‌.. | JSW MG Motor rolled out limited period price cuts | Sakshi
Sakshi News home page

ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్‌..

Jun 19 2025 1:22 PM | Updated on Jun 19 2025 2:51 PM

JSW MG Motor rolled out limited period price cuts

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత ఆటోమోటివ్ వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించింది. భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించి ఆరేళ్లు అవుతున్న నేపథ్యంలో ఎంజీ సంస్థ తన జెడ్ఎస్ ఈవీ మోడల్‌పై గణనీయమైన ధర తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. లిమిటెడ్ టైమ్ యానివర్సరీ ఆఫర్లో భాగంగా జెడ్ఎస్ ఈవీ ఇప్పుడు రూ.16.75 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుందని పేర్కొంది.

ఇదీ చదవండి: వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ షట్‌డౌన్‌!

ఎంజీ జెడ్ఎస్ ఈవీ వేరియంట్లను అనుసరించి ఎక్స్‌షోరూమ్‌ ధరల్లో మార్పులు ప్రకటించింది. దాంతో ఎసెన్స్‌ వేరియంట్‌పై అత్యధికంగా రూ.4,44,000 వరకు రాయితీ పొందవచ్చని ఎంజీ తెలిపింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ క్లీన్ మొబిలిటీని పోత్సహించేలా వినియోగదారులకు ఈ ప్రత్యేక ధరలను అందిస్తున్నట్లు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement