breaking news
Spam Calls Detect
-
నంబర్ బ్లాక్ చేస్తే సరిపోదు
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్‌ని ఆపేందుకు ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడంతో సరిపెట్టొద్దని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ డీఎన్డీ (డు నాట్ డిస్టర్బ్) యాప్ ద్వారా ఆ నంబర్ల గురించి ఫిర్యాదు చేయాలని సూచించింది. డీఎన్డీ యాప్ ద్వారా వచి్చన ఫిర్యాదుల ఆధారంగా స్పామ్, మోసపూరిత మెసేజీలతో సంబంధమున్న సుమారు లక్ష ఎంటీటీలను (సంస్థలు, వ్యక్తులు), 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్, బ్లాక్‌లిస్ట్ చేశామని పేర్కొంది. యూజర్లు ఏదైనా స్పామ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ గురించి యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వాటిని ట్రేస్ చేసేందుకు, నిర్ధారించుకునేందుకు, శాశ్వతంగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేసేందుకు ట్రాయ్ అలాగే టెలికం సర్వీస్ ప్రొవైడర్లకి వీలవుతుందని తెలిపింది. అలా కాకుండా వ్యక్తిగతంగా బ్లాక్ చేయడమనేది ఆ డివైజ్‌కి మాత్రమే పరిమితమవుతుందని, స్కామర్లు ఇతరులను కాంటాక్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూజర్లంతా కలిసికట్టుగా ఫిర్యాదులు చేస్తే, దేశవ్యాప్తంగా టెలికం సేవల దురి్వనియోగాన్ని అరికట్టవచ్చని వివరించింది. -
స్పామ్ కాల్స్‌తో తలనొప్పా? తక్షణం రిపోర్ట్ చేయండి!
సాక్షి, హైదరాబాద్: నేటి బిజీబిజీ జీవితాల్లో ప్రతి నిమిషం విలువైందే. ఎక్కడో అత్యంత ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. ఒకసారి ఆన్సర్ చేయకపోతే మరోసారి వరుసగా మోగుతూనే ఉంటుంది. తీరా ఫోన్ ఆన్సర్ చేస్తే.. అవతలి వ్యక్తి హలో అంటూ మొదలు పెట్టి.. మనకు సంబంధం లేని ఏవేవో వాణిజ్య ప్రకటనలు, భూముల కొనుగోళ్లు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్లు అవసరం లేకుండా ప్రీ అప్రూవ్డ్ లోన్లు.. అంటూ దండకం అందుకుంటారు.ఇలాంటి స్పామ్ ఫోన్‌కాల్స్ తలనొప్పి కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి అనవసరమైన ఫోన్‌కాల్స్ బారి నుంచి బయటపడటంతోపాటు అనుమానాస్పద, మోసపూరిత యూఆర్ఎల్ (యూనిఫాం రిసోర్స్ లొకేటర్)పై సైబర్ క్రైం పోర్టల్ ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేసేందుకు రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ అనే ఆప్షన్ అందుబాటులో ఉందని నిపుణులు చెపుతున్నారు. ఇలా చేయండి..మీకు అనుమానాస్పద నంబర్ల నుంచి ఎవరైనా ఫోన్ కాల్స్ చేసి విసిగిస్తున్నా, మీ వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నా.. అలాంటి ఫోన్‌కాల్‌ను కట్ చేసి వదిలేయకుండా ఆ నంబర్ల వివరాలను పోలీసుల దృష్టికి తెచ్చి చర్యలు తీసుకోవచ్చని సైబర్ నిపుణులు చెపుతున్నారు. అందుకు మీరు చేయాల్సింది.. సైబర్ క్రైం పోర్టల్‌లోకి వెళ్లి రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. రిపోర్ట్ సస్పెక్ట్లోకి వెళ్లాలి.మీరు ఏ అంశానికి సంబంధించి ఫిర్యాదు చేయాలో కూడా అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫోన్ నంబర్, వెబ్సైట్ యూఆర్ఎల్, సోషల్ మీడియా యూఆర్ఎల్ నమోదు చేయాలి. మీకు ఏవిధంగా ఇబ్బంది కలిగిస్తున్నారన్న దానికి సంబంధించిన స్కీన్ర్షాట్ లేదా వాయిస్ రికార్డింగ్‌లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సైబర్ క్రైం పోలీసులు ఈ ఫిర్యాదులను సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటారు. -
రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్‌ను కట్టడి చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గణనీయంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధా (ఏఐ) ఆధారిత సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన రెండున్నర నెలల వ్యవధిలో ఏకంగా 800 కోట్ల స్పామ్ కాల్స్‌ను, 80 కోట్ల మెసేజీలను గుర్తించినట్లు తెలిపింది. అలాగే ప్రతీ రోజుదాదాపు పది లక్షల మంది స్పామర్లను గుర్తిస్తున్నట్లు వివరించింది. తమ నెట్‌వర్క్‌కు సంబంధించి మొత్తం కాల్స్‌లో ఆరు శాతం, మొత్తం ఎస్ఎంఎస్లలో రెండు శాతం స్పామ్ ఉంటున్నట్లు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ వాసులకు అత్యధికంగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అలాగే అత్యధిక కాల్స్ కూడా అక్కడి నుంచే జనరేట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇలాంటి కాల్స్‌ను అందుకుంటున్న కస్టమర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, పశి్చమ ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానంలో ఉంది. ఈ రెండున్నర నెలల్లో సందేహాస్పద కాల్స్, ఎస్ఎంఎస్ల గురించి దాదాపు 25.2 కోట్ల మందిని అప్రమత్తం చేశామని, దీంతో వాటికి స్పందించే వారి సంఖ్య సుమారు 12 శాతం తగ్గిందని ఎయిర్టెల్ వివరించింది. స్పామర్లలో అత్యధికంగా 35 శాతం మంది ల్యాండ్‌లైన్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు పేర్కొంది. అలాగే, పురుష కస్టమర్లే లక్ష్యంగా 76 శాతం కాల్స్ ఉంటున్నాయని వివరించింది. లావాదేవీలు, సరీ్వస్కి సంబంధించిన కాల్స్ చేసేందుకు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, స్టాక్‌బ్రోకర్లు, ఇతర ఆర్థిక సంస్థలు, కార్పొరేట్లు, ఎస్ఎంఈలకు ప్రభుత్వం 160 సిరీస్‌తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్లను కేటాయించినట్లు వివరించింది. డు–నాట్–డిస్టర్బ్ని (డీఎన్డీ) ఎంచుకోని వారికి, ప్రమోషనల్ కాల్స్‌ను అందుకునేందుకు అంగీకరించిన వారికి యథాప్రకారం 140 సిరీస్‌తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్ల నుంచే కాల్స్ వస్తాయని పేర్కొంది. మిగతా వివరాల్లోకి వెళ్తే.. → ఢిల్లీ, ముంబై, కర్ణాటక అత్యధికంగా స్పామ్ కాల్స్ జనరేట్ అవుతున్న ప్రాంతాల్లో వరుసగా టాప్ 3లో ఉన్నాయి. ఎస్ఎంఎస్లపరంగా (టెక్ట్స్ మెసేజీలు) గుజరాత్, కోల్‌కతా, ఉత్తర్‌ప్రదేశ్‌లు ఈ స్థానాల్లో ఉన్నాయి. → 36–60 ఏళ్ల వయసు గల కస్టమర్లు లక్ష్యంగా 48 శాతం కాల్స్ ఉంటున్నాయి. 26 శాతం కాల్స్‌తో 26–35 ఏళ్ల వారు రెండో స్థానంలో ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు ఎనిమిది శాతం స్పామ్ కాల్స్ మాత్రమే వచ్చాయి. → స్పామ్ కాల్స్ ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. తర్వాత ఉధృతి క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గం.ల సమయానికి తారాస్థాయికి చేరుతుంది. మొత్తం స్పామ్ కాల్స్‌లో 22 శాతం కాల్స్.. రూ. 15,000–20,000 ధర శ్రేణిలోని మొబైల్స్ కలిగిన కస్టమర్లు లక్ష్యంగా ఉంటున్నాయి. → పనిదినాల్లోనూ, వారాంతాల్లోనూ వచ్చే కాల్స్ పరిమాణంలో వ్యత్యాసం ఉంటోంది. ఆదివారాలు ఇలాంటి కాల్స్ ఏకంగా 40 శాతం తగ్గుతున్నాయి. -
స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు
స్పామ్, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల్లో స్పామ్ మెసేజ్‌లు, కాల్స్‌తోపాటు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపింది.ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేలా ట్రాయ్ తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్టెల్ పేర్కొంది. ఏకీకృత యాంటీ స్పామ్ ఎకోసిస్టమ్‌ను సృష్టించడానికి ఓటీటీలు, టెలికాం ఆపరేటర్ల మధ్య తప్పనిసరి పాటించాల్సిన నియమాలను అభివృద్ధి చేయాలని సూచించింది. బిజినెస్ వెరిఫికేషన్, డేటా షేరింగ్ వంటి చర్యలతో ఈ మోసాలను కొంతవరకు కట్టడి చేయవచ్చని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్‌లో రూపొందించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది. -
స్పామ్ కాల్స్ నివారణకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్‌లో రూపొందించింది. ‘ఇబ్బందికర కాల్స్ నివారణపై వినియోగదారుల వ్యవహారాల శాఖ పని చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా విభిన్న భాగస్వాములతో నిమగ్నమవ్వాల్సి వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కూడా నిబంధనలతో ముందుకు వస్తోంది. టెలికం నియంత్రణ సంస్థకు పూర్తి అధికారాలను ఇవ్వాలనుకుంటున్నాము. కాబట్టి మేము నెమ్మదించాం. కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు టెలికం పరిశ్రమ కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతోంది’ అని నిధి ఖరే వివరించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది. -
100 కోట్ల స్పామ్ కాల్స్‌కు చెక్
భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన యాంటీ స్పామ్ టెక్నాలజీ (ఏఎస్టీ) సంచలనం సృష్టిస్తోందని టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఏఎస్టీ వినియోగంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లో దేశవ్యాప్తంగా కంపెనీ 100 కోట్ల స్పామ్ కాల్స్‌ను గుర్తించి కస్టమర్లను హెచ్చరించింది. స్పామ్ కాల్, ఎస్ఎంఎస్ను విశ్లేషించి కస్టమర్‌ను అప్రమత్తం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. 2 మిల్లీ సెకన్లలో ఈ సొల్యూషన్ 150 కోట్ల సందేశాలను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 12.2 కోట్ల స్పామ్ కాల్స్, 23 లక్షల స్పామ్ సందేశాలను గుర్తించినట్టు ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ సర్కిల్ సీఈవో శివన్ భార్గవ తెలిపారు. కంపెనీ వినియోగిస్తున్న సాంకేతిక వల్ల స్పామ్ కాల్స్ 97 శాతం, స్పామ్ ఎస్ఎంఎస్లు 99.5 శాతం తగ్గాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20 లక్షల స్పామర్స్ను గుర్తించినట్టు పేర్కొన్నారు. ఏఎస్టీ కచ్చితత్వం 97 శాతం ఉందన్నారు.ఇదీ చదవండి: కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణస్పామ్ కాల్స్ సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని శివన్ భార్గవ వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా స్పామ్ కాల్స్ కారణంగా ఏడాదిలో 3 బిలియన్ డాలర్ల(రూ.25 వేలకోట్లు) విలువైన బ్యాంకు మోసాలు నమోదయ్యాయి. 2024 ఏప్రిల్–జులై మధ్య భారత్‌లో రూ.1,720 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. సైబర్ మోసాలపై నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్సీఆర్పీ) రోజూ సుమారు 7,000 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. దేశంలో 60 శాతం మంది మొబైల్ యూజర్లకు రోజులో కనీసం మూడు స్పామ్ కాల్స్ వస్తున్నాయి. 87 శాతం మంది అవాంచిత ఎస్ఎంఎస్లు అందుకుంటున్నారు. స్పామ్ ముప్పునకు పరిష్కారం కోసం ఏడాదిగా శ్రమించి ఏఎస్టీని సొంతంగా అభివృద్ధి చేశాం. 100 మందికిపైగా డేటా సైంటిస్టులు నిమగ్నమయ్యారు’ అని వివరించారు.


