స్పామ్‌ కాల్స్‌.. ఇక బ్లాక్‌! | Trai plan to block AI-flagged spam numbers | Sakshi
Sakshi News home page

స్పామ్‌ కాల్స్‌.. ఇక బ్లాక్‌!

Feb 16 2026 4:02 AM | Updated on Feb 16 2026 4:02 AM

Trai plan to block AI-flagged spam numbers

ఫిర్యాదుల అవసరం లేకుండానే నిషేధం

స్పామ్‌ నంబర్‌గా టెల్కోలు గుర్తిస్తే చర్యలు 

కసరత్తు చేస్తున్న టెలికం నియంత్రణ సంస్థ

అవాంఛిత, మోసపూరిత కాల్స్, సందేశాలు ప్రపంచానికి సవాల్‌గా మారాయి. వ్యక్తుల భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు ఆర్థిక నష్టాలకూ ఇవి కారణం అవుతున్నాయి. మన దేశంలో 95% మంది మొబైల్‌ యూజర్లకు ప్రతిరోజూ స్పామ్‌ కాల్స్, సందేశాలు వెల్లువెత్తుతున్నాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) సిద్ధమవుతోంది. కస్టమర్‌ అందుకున్న కాల్, మెసేజ్‌ను టెలికం కంపెనీ స్పామ్‌గా గుర్తిస్తే ఆ నంబర్‌ను బ్లాక్‌ లిస్టులోకి చేర్చాలని భావిస్తోంది. 

అలాగే అధికారిక ఫిర్యాదు లేకపోయినా స్పామ్‌ మెసేజ్‌లు పంపే మొబైల్‌ నంబర్‌ను డిస్‌కనెక్ట్‌ చేయాలన్న ప్రతిపాదనపై ట్రాయ్‌ కసరత్తు చేస్తోంది. టెలికం కంపెనీలతో ఈ మేరకు చర్చిస్తోంది. ప్రస్తుతం టెల్కోలు 10 రోజుల వ్యవధిలో ఐదు ప్రత్యేక ఫిర్యాదులను స్వీకరిస్తే స్పామర్‌పై చర్య తీసుకుంటున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం ఒక నంబర్‌ను వరుసగా 10 రోజులపాటు అనుమానిత స్పామ్‌గా ఏఐ టెక్నాలజీ గుర్తిస్తే.. ఆ నంబర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా కూడా చర్య తీసుకోవచ్చు. ఇది అమల్లోకి వస్తే స్పామ్‌ కాల్స్, మెసేజెస్‌ కట్టడికి టెలికం కంపెనీలు చేపడుతున్న చర్యలకు మరింత ఊతం ఇచి్చనట్టు అవుతుంది.     – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

రియల్‌ టైమ్‌లో విశ్లేషించి.. 
ప్రస్తుతం దేశంలో ఏదైనా అవాంఛిత సమాచారాన్ని స్పామ్‌గా గుర్తించడానికి నిర్దిష్ట నియమాలు లేవు. కాల్స్, సందేశాలు పంపినవారి రోజువారీ వినియోగ తీరు, కాల్స్‌ ఎంత సమయం మాట్లాడుతున్నారు, ఎన్ని సందేశాలు పంపిస్తున్నారు, ఎవరెవరికి, ఏ ప్రాంతంలో ఉన్నవారికి ఈ కాల్స్‌ చేస్తున్నారు వంటి అంశాలను టెల్కోలు ఉపయోగిస్తున్న ఏఐ సాంకేతికత రియల్‌ టైమ్‌లో విశ్లేషించి.. అవాంఛిత కాల్స్, మెసేజెస్‌ను గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. కాల్‌ను అంగీకరించడం లేదా తిరస్కరించడం అనేది కస్టమర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అనుమానిత స్పామ్‌గా గుర్తించిన అనేక కాల్స్‌ నిజమైన కాలర్ల నుంచి వచి్చనవే ఉంటున్నాయి. వాటిలో గిగ్‌ వర్కర్లతోపాటు ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయి.

వ్యవస్థీకృతంగా మోసాలు.. 
2024 సెపె్టంబర్‌ నుంచి 2026 జనవరి మధ్య 7,100 కోట్ల స్పామ్‌ కాల్స్, 290 కోట్ల స్పామ్‌ సందేశాలను గుర్తించినట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 8 లక్షలకుపైగా మోసపూరిత లింక్స్‌ను బ్లాక్‌ చేసినట్లు వెల్లడించింది. సైబర్‌ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కాల్‌ సెంటర్లతో వ్యవస్థీకృతంగా మోసపూరిత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. సైబర్‌ నేరగాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 92.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ రెగ్యులేటరీ ఆఫీసర్‌ రాహుల్‌ వాట్స్‌ వెల్లడించారు. 250కిపైగా కొలమానాలను పరిగణనలోకి తీసుకొని స్పామ్‌ కాల్స్, సందేశాలను గుర్తిస్తున్నట్టు చెప్పారు.

టెల్కోలు ఏఐ సొల్యూషన్స్‌ సాయంతో ప్రతి నెలా సుమారు 40 కోట్ల కాల్స్, సందేశాల ను అనుమానిత స్పామ్‌గా గుర్తిస్తున్నాయి.  
 నమోదు కాని టెలీమార్కెటర్ల నుంచి వస్తున్న వాటిలో 7.5 కోట్ల కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ప్రతిరోజూ బ్లాక్‌ అవుతున్నాయి.  
స్పామర్లపై టెల్కోలకు రోజుకు సగటున 10,000 ఫిర్యాదులు మాత్రమే     అందుతున్నాయని సమాచారం.  

2025 ఫిబ్రవరిలో 1,16,213 స్పామ్‌ ఫిర్యాదులు టెల్కోలకు అందగా 2025 డి సెంబర్‌లో ఆ సంఖ్య 3,34,317కు చేరింది. 
ఫిర్యాదులలో ఎక్కువ భాగం నమోదు కాని టెలిమార్కెటర్లపైనే ఉంటున్నాయి.  

టెలిమార్కెటింగ్‌ కంపెనీల ప్రతినిధులు సాధారణంగా 10 అంకెల మొబైల్‌ నంబర్‌ ద్వారా కాల్స్‌ చేస్తున్నారు. 
 భారత్‌లో 116 కోట్ల మంది మొబైల్‌ సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. వారిలో అవాంఛిత కాల్స్‌ను నివారించేందుకు ట్రాయ్‌ తీసుకొచి్చనడు నాట్‌ డిస్టర్బ్‌ (డీఎన్‌డీ) సేవలను 22 కోట్ల మంది మాత్రమే ఎంపిక చేసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement