2004లో మా టీవీలో ప్రారంభమైన ‘విహారి ది ట్రావెలర్’ ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ట్రావెల్, ఫుడ్, టూరిజం సంబంధిత వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కార్యక్రమం.. నవంబర్‌లో కొత్త యాప్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
విహారి ద్వారా గతంలో కరుణ, స్నిగ్ధ వంటి ప్రముఖ యాంకర్లు ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలను అందించారు. ఇప్పుడు ఓటీటీ వేదికపై యాంకర్ శ్రీ సత్య హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అంతేకాకుండా నవంబర్ నుంచి యాంకర్ సుమతో వినూత్నమైన ఎపిసోడ్స్‌ను ప్రసారం చేయనున్నారు.
విహారి ఓటీటీ ప్రోమో లాంచ్ కార్యక్రమానికి సదరన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రవీణ్, వజ్ర కన్స్ట్రక్షన్స్‌కు చెందిన రాజు, శ్వేతతో పాటు యాంకర్ శ్రీ సత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఓటీటీకి టీటీఎఫ్, వేగ జ్యువెలర్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రోమో విడుదల కాగా.. నవంబర్‌లో యాప్ ప్రారంభం కానుంది.


